ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్.. కరువు బ్యాచ్ అలాంటి పిక్స్ పంపిన వెంటనే!

సోషల్ మీడియా రావడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటున్నాయో.. అన్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు అలంటి ఎన్నో దారుణాలను నిత్యం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో వాటిలో కొన్ని సమస్యలకు చెక్ పెట్టేలా.. ఇంస్టాగ్రామ్ కొన్ని కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

సోషల్ మీడియా రావడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటున్నాయో.. అన్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు అలంటి ఎన్నో దారుణాలను నిత్యం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో వాటిలో కొన్ని సమస్యలకు చెక్ పెట్టేలా.. ఇంస్టాగ్రామ్ కొన్ని కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

సోషల్ మీడియా ఇప్పుడు ఇది నిత్యావసర వస్తువులలో భాగంగా మారిపోయింది. సోషల్ మీడియా లేనిది రోజు గడవలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం మరింత ఎక్కువ పెరిగిందని చెప్పి తీరాలి. సోషల్ మీడియా రావడం వలన ఎంతో మందికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా నిమిషాల్లో తెలుసుకోగలుతున్నాం. ఇదంతా ఒక వైపైతే.. మరోవైపు.. యువత చాలా రకాలుగా చెడిపోతున్నారని చెప్పి తీరాలి. ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయే వరకు సోషల్ మీడియాలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. కొంతమందైతే రాత్రి పగలు తేడా లేకుండా పాపులర్ అవ్వడం కోసం వింత వింత చేష్టలు చేస్తూ.. సోషల్ మీడియాలో వారి వీడియోస్ ను పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ నిత్యం చూస్తూనే ఉన్నాము. అయితే, వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వారి ఫొటోస్ ద్వారా వారిని బెదిరించడం. ఇప్పుడు ఇలాంటి వాటికీ చెక్ పెట్టేలా తాము కొత్త టూల్ ను ప్రవేశ పెడుతున్నామంటూ వెల్లడించింది ఇంస్టాగ్రామ్.

సోషల్ మీడియాను కొంతమంది ఫేమస్ అవ్వడం కోసం వినియోగిస్తుంటే.. మరికొంతమంది మాత్రం.. ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్, ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ద్వారా.. ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకుంటున్నారు. ఈ రకంగా ప్రేమలో పడిన జంటలు, దేశ సరిహద్దులు దాటి వచ్చిన యువతి యువకులు కూడా ఎంతో మంది ఉన్నారు. వీరంతా ఓ రకం అయితే.. కేవలం టైమ్ పాస్ కోసం.. అమ్మాయిలను ట్రాప్ చేయడం కోసం.. కొంతమంది అబ్బాయిలను ట్రాప్ చేయడం కోసం కూడా ఈ ప్లాట్ ఫార్మ్ ను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది యువతి యువకులు.. ప్రేమ అనే మత్తులో ఉండి ఒకరికి ఒకరు న్యూడ్ ఫోటోలను పంపించుకుంటూ ఉంటారు. ఈ ఫోటోల వలన ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో ఇటువంటి వాటి పట్ల తగిన చర్యలు తీసుకునేలా.. యువతను ఈ ట్రాప్స్ కు గురి కాకుండా చూసుకోవడం కోసం. కొత్త టూల్స్ ను ప్రవేశ పెడుతున్నాం అని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ వెల్లడించింది. అదేంటో తెలుసుకుందాం.

యువతి యువకులు ఒకరితో ఒకరు క్లోజ్ గా ఉన్న సమయంలో.. డైరెక్ట్ గా చాటింగ్ చేసే సమయంలోనే న్యూడ్ ఫొటోస్ ను పంపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంస్టాగ్రామ్ టూల్ వలన.. అలా న్యూడ్ ఫొటోస్ ను పంపిస్తే.. అవి ఆటోమాటిక్ గా బ్లర్ చేస్తుందని వెల్లడించింది. ఇలాంటి నగ్న చిత్రాలను అదునుగా తీసుకుని స్కామర్లు యూజర్లను బెదిరిస్తున్న సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్న సందర్భాలను.. దృష్టిలో ఉంచుకుని.. యువతను రక్షించే దిశగా.. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ వెల్లడించింది. అంతేకాకుండా డైరెక్ట్ మెసేజ్ న్యూడ్ రక్షణా సదుపాయాన్ని తాము పరిరక్షిస్తున్నామని ఇంస్టాగ్రామ్ తెలిపింది. ఇకపై ఎవరైనా కానీ ఇలా నగ్న చిత్రాలను పంపితే ఈ కొత్త ఫీచర్ వాటిని బ్లర్ చేస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త ఫీచర్ యువతకు మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments