Robot: రోబో రైతు అయితే ఎలా ఉంటుందో తెలుసా? వీడియో వైరల్..

Artificial Intelligence: ఈ టెక్నాలజీ యుగంలో మానవుడు సృష్టించిన అద్భుతం Artificial Intelligence. దీనితో మనుషులకు ఉపయోగపడే పనులు ఎన్నో చెయ్యొచ్చు

Artificial Intelligence: ఈ టెక్నాలజీ యుగంలో మానవుడు సృష్టించిన అద్భుతం Artificial Intelligence. దీనితో మనుషులకు ఉపయోగపడే పనులు ఎన్నో చెయ్యొచ్చు

ప్రస్తుతం టెక్నాలజీ ఏ విధంగా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంకేతికతను ఉపయోగించి..మనిషి అనేక అద్భుతాలను చేస్తున్నాడు. అంతేకాక మరిన్ని కొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అనేక రకాలైన వాటిని మానవుడు సృష్టించాడు. అలా మానవుడు సృష్టించిన అద్భుతాల్లో కృతిమ మేధస్సు ఒకటి. దీనితో మనుషులకు ఉపయోగపడే పనులు ఎన్నో చెయ్యొచ్చు. ఏఐని సరిగ్గా వాడుకుంటే అనేక గొప్ప గొప్ప పనులను చెయచ్చు. ప్రస్తుతం మనం వినియోగించే స్మార్ట్ మొబైల్స్ కూడా ఏఐ ఫీచర్లతో వచ్చేస్తున్నాయి. ఇంకా ఏఐ తో కూడిన చాలా రకాల వస్తువులను మనం మార్కెట్లో చూడవచ్చు. ఇలా కృత్రిమ మేధస్సు అనేక మంచి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని ఇతర పనులు కూడా చేసేస్తున్నారు. ఏఐను సరిగ్గా వినియోగించుకుంటే మాత్రం ఎంతో టైమ్ సేవ్ అవుతుంది.

తాజాగా ఒక రోబోకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రోబో అచ్చం రైతుల మారిపోతే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇప్పటికే మనం ఇలాంటి రోబోలో గతంలో చూసాం. రోబోలు డెలివరీ బాయ్స్ లాగా మారి డెలివరీ చేస్తున్నట్లు, హోటల్స్ లో కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తున్నట్లు ఇలా చాలా వీడియోలు చూసాము. ఇక ఇప్పుడు అచ్చం రైతులాగా రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆ రోబోట్…రైతన్నలు చేసే ప్రతి పని చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. పొలంలో వరి నాటడం, పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ప్రతి పనిని రోబోట్ చేస్తోంది.

ఈ వీడియో Interesting STEM అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే ఏకంగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసి నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది రియల్ రోబోట్ కాదు. ఈ వీడియోని ఎడిట్ చేసారని స్పష్టంగా తెలుస్తుంది. కానీ మనిషి తలుచుకుంటే ఇలాంటి రోబోని తయారు చేయొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తునారు. ఇలాంటి AI రోబోలు నిజంగానే అందుబాటులోకి వస్తే.. రైతులకు చాలా మేలు కలుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. రోబోలను వ్యవసాయ రంగంలోకి తీసుకొస్తే..పెనుమార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడున్నారు.

రైతులకు ఆర్థిక, శారీరక శ్రమ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. ఇంకా ఏదైనా కిష్టమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు రైతులకు బదులుగా రోబోలను వినియోగించవచ్చని అంటున్నారు. రైతులు పంట సాగు చేసే సమయంలో కూలీల కొరత ఏర్పడి..చాలా నష్టపోతున్నాడు. అంతేకాక కొన్నిసార్లు ఎక్కువ మంది మనుషులతో పనులు చేయిస్తుంటారు. దీంతో ఆర్థికంగా రైతులు బాగా ఇబ్బంది పడుతుంటారు. పంటలకు రసాయనాలు పిచ్చకారి చేసే సమయంలో కూడా కొందరు రైతులు అస్వస్థతకు గురవుతుంటారు. ఇలాంటి అనేక సమస్యలకు రోబోట్ తో పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఫార్మర్ రోబోట్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments