వీడియో: వరదల ఎఫెక్ట్.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు!

VIRAL VIDEO: ఇటీవల దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల పెద్ద పెద్ద వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. ఈ మధ్యనే కేరళాలో భారీ వర్షాల కారణంగా కొండచిరియలు విరిగి భీతావాహాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

VIRAL VIDEO: ఇటీవల దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల పెద్ద పెద్ద వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. ఈ మధ్యనే కేరళాలో భారీ వర్షాల కారణంగా కొండచిరియలు విరిగి భీతావాహాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

దేశ వ్యాప్తంగా రుతు పవనాలు చురుకుగా కొనసాగుతున్నాయి.. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. గత నెల రోజులుగా మహారాష్ట్ర, కేరళ, బీహార్, అస్సాం, సిక్కీం, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల జలదిగ్భంధం అవుతున్నాయి. జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.. పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. ఇటీవల కేరళాలో కొండచిరియలు విరిగిపడి భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తాజాగా పవర్ స్టేషన్ పై కొండచరియలు విరిగి పడ్డాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

సిక్కింలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం సిక్కీంలోని నేషనల్ హైబ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (NHPC) తీస్తా స్టేజ్ 5 డ్యామ్ లోని పవర్ స్టేషన్ పై భారీ కొండ చరియలు పడి ధ్వంసం అయ్యింది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్.. దీన్ని ఆనుకొని కొండ చిరియలు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా తరుచూ చిన్నపాటి రాళ్లు జారుతున్నాయి. ఇది గమనించిన అధికారు కొండ చిరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ముందుగానే గమనించారు.అనుకున్నట్లుగాను మంగళవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ కేంద్రం శిథిలాలతో ధ్వంసం అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ పవర్ ఉత్పత్తి కావడం లేదు.

2023 సిక్కీంలో వచ్చిన వరదల కారణంగా భారీ విస్పోటం జరిగింది. సౌత్ ల్హోనాక్ హిమనది సరస్సు పగిలిపోవడంతో స్టేజ్ 5 ఆనకట్ట పనికిరాకుండా పోయింది. అదృష్ట వశాత్తు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పలు కట్టడాలు, డ్యాములు కూలిపోతున్నాయి.. వాటికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments