నమ్మి పెళ్లి చేసుకుంటే.. దారుణంగా మోసం చేశాడు: సింగర్‌

నటి, ప్రముఖ సింగర్‌ సుచిత్రా కృష్ణమూర్తి తన భర్తతో విడిపోవడానికి కారణాలు వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. ఎంతో నమ్మి పెళ్లి చేసుకుంటే.. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ తనను మోసం చేశాడని, అందుకే అతనితో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. వైవాహిక బంధంలో తన మాజీ భర్త శేఖర్‌ కపూర్‌ నిజాయితీగా లేరని, అందుకే ఆయనతో బంధానికి ముగింపు పలికానని అన్నారు.

సుచిత్రా మాట్లాడుతూ.. ‘సినిమా అంటే ఏంటో పెద్దగా తెలియని కుటుంబం నుంచి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్‌ టైమ్‌లోనే నాకు అవకాశాలు వచ్చాయి. కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ‘కబీ హా.. కబీ నా’ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. సేమ్‌ టైమ్‌లో మలయాళ సినిమాలోనూ నటించా. సినిమా పరిశ్రమపై నా తల్లిదండ్రులకు మంచి ఉద్దేశం లేదు. అందుకే వారికి అబద్ధం చెప్పి మరీ కొచ్చి వెళ్లి సినిమాలో పనిచేశా. ఆ తర్వాత నేను నటించిన చాలా సినిమాలు సూపరహిట్స్‌ అయ్యాయి.

అదే సమయంలో శేఖర్‌తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఆయనను పెళ్లి చేసుకోవాలి అనే వరకు వచ్చింది. కానీ ఆయనను పెళ్లి చేసుకోవడం నా పేరెంట్స్‌కు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వయసులో ఆయన నా కంటే చాలా పెద్ద. పైగా అప్పటికే ఆయనకు విడాకులు అయి ఉన్నాయి. అతన్ని మర్చిపోవాలని, పెళ్లి చేసుకునే ఆలోచన మానుకోవాలని మా అమ్మ మోత్తుకుంది. కానీ నేను మాట వినలేదు. ఎట్టకేలకు ఆయనను పెళ్లి చేసుకున్నాను.

 

కానీ, కొంతకాలానికి మా మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరికి పొసగలేదు. దాంతో ఇద్దరం విడిపోయాం అని సుచిత్ర వివరించారు. శేఖర్‌ కపూర్‌ మిస్టర్‌ ఇండియా, ఎలిజిబెత్‌, వాట్స్‌ లవ్‌ గాట్‌ టు డు విత్‌ ఇట్‌ అనే చిత్రాలను తీశారు. సుచిత్ర పలు కన్నడ సినిమాల్లో నటించారు. అలాగే డోలే డోలే, జిందగీ వంటి ఆల్బమ్స్‌కు సింగర్‌గా పనిచేశారు. అయితే.. ఆమెను తాను మోసం చేశానని సుచిత్ర చేస్తున్న ఆరోపణలు ఫాల్స్‌ అలిగేషన్స్‌ అంటూ శేఖర్‌ కపూర్‌ కొట్టిపారేశారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments