Malla Reddy Engineering College: వీడియో: అన్నంలో పురుగులు..! మల్లారెడ్డి విద్యార్థినుల ఆందోళన!

వీడియో: అన్నంలో పురుగులు..! మల్లారెడ్డి విద్యార్థినుల ఆందోళన!

Malla Reddy Engineering College: మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక మల్లారెడ్డి కాలేజీలు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా మరోసారి విద్యార్థినులు ఆందోళనతో మరోసారి వార్తల్లో నిలించింది.

Malla Reddy Engineering College: మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక మల్లారెడ్డి కాలేజీలు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా మరోసారి విద్యార్థినులు ఆందోళనతో మరోసారి వార్తల్లో నిలించింది.

ఇటీవల కాలంలో ఆహారంలో పురుగులు, ఇతరత్రా వస్తువులు కనిపిస్తున్న ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేసిన, హోటల్ కి వెళ్లి తిన్నా ఇలాంటి  చేదు అనుభవాలు చోటుచేసుకుంటున్నాయి. అలానే వివిధ వసతి గృహాల్లో కూడా ఆహారంలో కూడా పురుగులు కనిపిస్తున్నాయి. దీంతో బాధితులు ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా మల్లారెడ్డి కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలు ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. గతంలో మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన వసతి గృహాలు వరద నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అలానే  మరికొన్ని అంశాలతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్ లో విద్యార్థినులు నిరసనకు దిగారు. సోమవారం రాత్రి అన్నం, స్వీట్లను వసతి గృహా నిర్వాహకులు విద్యార్థులకు సప్లయ్ చేశారంట. అయితే ఆ ఫుడ్ , స్వీట్లలో పురుగులు వచ్చాయనే విద్యార్థులు తెలిపారు. అంతేకాక మల్లారెడ్డి వుమెన్స్ క్యాంపస్ ఆవరణంలో విద్యార్థినులు ఆందోళన చేశారు. యాజమాన్యం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఇటీవల కూడా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో, పంచ్ లతో అందరిని అల్లరిస్తుంటారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి విజయం  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్ గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మామ, అల్లుడు అసెంబ్లీలో అడుగు పెట్టి, అందరిని ఆకట్టుకున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి కేజీ టూ పీజీ వరకు విద్యాసంస్థలను నడుపుతున్నారు. వైద్య, ఇంజినీరింగ్ కళాశాల్లో ఎంతో మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమంలో తరచూ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ తరచూ వివిధ విషయాల్లో వార్తల్లోకి ఎక్కుతుంది. రెండు రోజుల క్రితం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసుకున్న రోడ్డును తొలగించారు. హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల ఆదేశంతో జేసీబీ సాయంతో రోడ్డును తొలగించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిర్యాదుపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం విశేషం. మొత్తంగా విద్యార్థినుల ఆందోళనతో మల్లారెడ్డి కాలేజీలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

Show comments