నా భర్త నన్ను ముట్టుకోవడం లేదు.. భార్య న్యాయ పోరాటం!

LB Nagar Wife And Husband Issue: పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో భర్తతో సంతోషంగా ఉండాలని అత్తగారింటి గడపలోకి అడుగు పెడుతుంది.

LB Nagar Wife And Husband Issue: పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో భర్తతో సంతోషంగా ఉండాలని అత్తగారింటి గడపలోకి అడుగు పెడుతుంది.

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు, బంధుమిత్రులు దీవిస్తారు. కానీ ఈ మధ్య పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా విడిపోతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ వేధింపులు తాళ లేక పుట్టింటికి వెళ్తున్న ఆడబిడ్డలు ఉన్నారు. పెళ్లైన కొంత కాలానికే లేని పోని అపనిందలు మోపి పుట్టింటికి పంపుతున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు. పెళ్లైన మూడో రోజు నుంచే తనును ఇంట్లోకి రానివ్వలేదంటూ ఓ కోడలు అత్తవారింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి గొడవ ఇప్పుడు రచ్చకెక్కింది. పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని..  కోడలు ఇంటి ముందు ధర్నాకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.    గత ఏడాది మే 21న టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డితో వివాహం జరిగిందని.. పెళ్లికి ముందు నుంచే తన భర్త తనని ఇబ్బంది పెడుతున్నాడని.. అయినా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎలాంటి గొడవలు చేసినా పుట్టింటి వారి పరువు పోతుంది, అప్పటికే డబ్బు ఖర్చు చేశాం అని తల్లిదండ్రులు నచ్చజెప్పారని పావని తెలిపింది. తన తల్లిదండ్రులు పెళ్లి కోసం రూ.30 లక్షల అప్పు చేశారని.. తనకు పుట్టింటి వారు పెట్టిన బంగారం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తుంది పావని. పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనతో ఏనాడు సంతోషంగా లేడని.. తనని ముట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయాం చేయాలని పోరాటం చేస్తుంది. తన అత్తవారింటికి వచ్చే సమయానికి కుటుంబ సభ్యులు గెటుకు తాళం వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారని.. తనపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారని కన్నీరు పెట్టుకుంది.

తన భర్త తన పక్కలోకి కూడా రావల్లేదని.. తనపై  ఎలాంటి ఫీలింగ్స్ చూపించడం లేదని వాపోయింది.  తనకు ఎలర్జీ అంటూ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ విషయంలో తన ఆడబిడ్డ కూడా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తన భర్తను దూరం చేస్తుందని ఆరోపిస్తుంది. ఈ విషయం తెలిసి ఎల్బీ నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని పావనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తి లేదని భర్త ఇంటి ముందే బైఠాయించింది పావని. నా భర్త నాకు కావాలి అంటూ పోరాటం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై పావని భర్త కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పెళ్లైనప్పటి నుంచి నా భార్య ఎలర్జీతో బాధపడుతూ ఉండటం చూసి డాక్టర్ల వద్దకు వెళ్లి చూపించాను. ఆమెకు సోరియాసిస్ ఉందని వారు తెలిపారని అన్నారు. ఈ విషయం ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కన్ఫామ్ చేశారు. ఈ కారణంతోనే నా భార్యకు దూరంగా ఉంటున్నా. కానీ ఆమె నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియలో రచ్చ చేస్తుంది’ అని అన్నాడు. పావని మామ రాజిరెడ్డి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు మా కోడలికి సోరియాసిస్ ఉందన్న విషయం ఆమె తల్లిదండ్రులు దాచి పెద్ద తప్పు చేశారు. ఈ విషయం గురించి నా కొడుకు బాధపడుతున్నాడు.. అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడని అన్నారు.  మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. పావని ధర్నా చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Show comments