Power Cut: హైదరాబాద్‌వాసులకు అలర్ట్‌.. నేటి నుంచి నగరంలో కరెంట్‌ కోతలు

నగరంలో కరెంట్‌ కోతలు ఉండనున్నట్లు వెల్లడించారు. ప్రాంతాల వారీగా విద్యుత్‌ కోతలుండనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు...

నగరంలో కరెంట్‌ కోతలు ఉండనున్నట్లు వెల్లడించారు. ప్రాంతాల వారీగా విద్యుత్‌ కోతలుండనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు...

నగరవాసులకు విద్యుత్‌ శాఖ అధికారులు కీలక సూచన జారీ చేశారు. నేటి నుంచి అనగా జనవరి 17, బుధవారం నుంచి హైదరాబాద్‌ నగరంలో ప్రాంతాల వారీగా కరెంట్‌ కోతలు ఉండనున్నాయి అని తెలిపారు. ఈమేరకు కీలక సూచనలు జారీ చేశారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ కరెంట్‌ కోతలు ఉండనున్నాయి అని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలోని పలు ప్రాంతాల్లో పవర్‌ కట్స్‌ ఉంటాయని తెలిపారు విద్యుత్‌ శాఖ అధికారులు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. అయితే కరెంట్‌ కోతలకు గల కారణాలను వివరించారు అధికారులు. ఆ వివరాలు..

నేటి నుంచి హైదరాబాద్‌ నగరంలో కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. వార్షిక నిర్వహణ, మరమ్మతు పనుల్లో భాగంగా నగరంలో కరెంట్‌ కోతలను అమలు చేస్తున్నట్టు టీఎస్ఎస్ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. నిర్వహణ పనుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు నగరవ్యాప్తంగా కరెంట్‌ కోతలు ఉంటాయని తెలిపారు.

మరికొన్ని రోజుల్లో వేసవి కాలం రానుంది. మిగతా సీజన్లతో పోలిస్తే.. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉండనుంది. అందుకు తగ్గట్లుగా సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా.. రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి చేస్తామని ముషారఫ్ తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రం ప్రతి రోజు పవర్‌ కట్‌ ఉండదని.. ఒక్కో ఫీడర్ పరిధిలో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 3,000 బేసి ఫీడర్‌లు ఉన్నాయని.. నేటి నుంచి (జనవరి 17) ఫిబ్రవరి 10, 2024 వరకు (ఆదివారాలు, పండుగ రోజులు మినహా) 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్ నిలిపేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామని ముషారఫ్‌ తెలిపారు. అంతేకాక నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని ఆయన వెల్లడించారు.

Show comments