TSRTC శుభవార్త! ఆ ప్రయాణికులకు.. టికెట్స్ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌!

వేసవి సెలవులు, ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్నారా.. ? అయితే ఈ న్యూస్ మీ కోసమే.. టీఎస్ఆర్టీసీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

వేసవి సెలవులు, ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్నారా.. ? అయితే ఈ న్యూస్ మీ కోసమే.. టీఎస్ఆర్టీసీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ఓ వైపు.. ఎన్నికల హడావుడి మరో వైపు నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్వగ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు కొందరు. బడులకు సెలవులు ప్రకటించడంతో పిల్లల్ని సొంత గ్రామాలకు పంపిస్తున్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటు వేయాలన్న ఉద్దేశంతో చాలా మంది స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. నగరానికి వచ్చి స్థిర పడ్డ ఏపీ ప్రజలు.. ఓట్లు, ఇతర కారణాలతో తిరిగి తమ ఊళ్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ను కలిపే హైవేలపై మధ్యాహ్నం వేళ కూడా కొన్ని సార్లు వాహనాల రద్దీ నెలకొంటోంది. వాహనాలు కూడా లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ రహదారి మార్గంలో.

ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీస ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ మార్గంలో ప్రతి రోజు 120కి పైగా బస్సు సర్వీసులను సంస్థ నడుపుతోందని పేర్కొన్నారు. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ -గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయని తెలిపారు. అలాగే మరో ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటే 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించారు సజ్జనార్.

అలాగే తిరిగి నగరానికి వచ్చే ప్రయాణపు టికెట్టుపై కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inని సంప్రదించాలని సజ్జనార్ ట్వీట్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ ఆఫర్ వినియోగించుకోండి. ఇవే కాదు.. వేసవిలో ప్రయాణీకుల రద్దీని పరిణగనలోకి తీసుకుని సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రెడీ అయ్యింది. తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్‌- నరసాపురం మధ్య మరిన్ని స్పెషల్ రైళ్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

Show comments