దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్.. ఎలా అంటే..!

దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్.. ఎలా అంటే..!

సోషల్ మీడియా ద్వారా వివిధ రకాల నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కారమైన సంగతి తెలిసింది. ఇలానే తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ ఏకంగా ఓ దొంగను పట్టించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

సోషల్ మీడియా ద్వారా వివిధ రకాల నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కారమైన సంగతి తెలిసింది. ఇలానే తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ ఏకంగా ఓ దొంగను పట్టించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

నేటి సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఎంతో మంది  సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు. దీని ద్వారా ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఇక వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాద్యమాల ద్వారా వివిధ సమాచారాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఎవరైనా తప్పిపోయినా, ఏదైనా సంఘటన జరిగినా ఆయా ప్రాంతాల్లోని వారిని సోషల్ మీడియా గ్రూప్ ల ద్వారా అలెర్ట్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ గ్రూప్ ఓ దొంగను పోలీసులకు పట్టించింది. కానీ చివరకు మరో ట్విస్ట్ జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో అనేక దొంగతనాలు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా చోరీల ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సార్లు సోషల్ మీడియా  ప్లాట్ ఫామ్స్ నిందితులను, నేరాలు చేసిన వారిని పట్టిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా ప్రాంతంలో ఓ దొంగను వాట్సాప్ గ్రూప్ పట్టించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ సమీపంలోని యాదగిరినగర్‌లో ఓ వ్యక్తి తరచూ ఇళ్లలోకి వెళ్లి.. స్టీల్‌ నల్లాలు చోరీ చేస్తున్నాడు. ఈ దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సీసీఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ బస్తీవాసులు తమ వాట్సాప్‌ గ్రూప్‌లో నిందితుడి వీడియో, ఫొటోలు పోస్టు చేశారు.

ఇలా వారు గ్రూప్ లో పోస్టు చేసిన సమయంలోనే బుధవారం ఉదయం బస్తీలో నల్లాలను చోరీ చేసేందుకు సదరు వ్యక్తి రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అతడు ఆ ప్రాంతంలోకి రాగానే స్థానికులు పట్టుకున్నారు. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, మొబైల్ లేదు. మత్తులో ఉన్నట్లు గుర్తించి మధురానగర్‌ పోలీసులకు అప్పగించారు. ఆ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది బిజీగా ఉన్నారు. అది గమనించిన దొంగ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి పరారయ్యాడు. కాసేపటికి నిందితుడు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడి కోసం గాలింపు చర్యలు చేశారు. అయితే పోలీసులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఇలా సోషల్ మీడియా ద్వారా అనేక ప్రయోజనాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో  సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు, వీడియోలే దొంగలను పట్టిస్తున్నాయి.

Show comments