Telangana Anganwadi: జాబ్ లేని మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. 9 వేల అంగన్వాడీ జాబ్స్.. అర్హులు వీరే

జాబ్ లేని మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. 9 వేల అంగన్వాడీ జాబ్స్.. అర్హులు వీరే

Telangana Anganwadi: మహిళలకు భారీ గుడ్ న్యూస్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. 9 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Telangana Anganwadi: మహిళలకు భారీ గుడ్ న్యూస్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. 9 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ జాబ్స్, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ ను జాబ్ క్యాలెండర్ లో వెల్లడించారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్ అందించనుంది ప్రభుత్వం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది ప్రభుత్వం. దాదాపు 9 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.

జాబ్ లేని మహిళలకు గోల్డెన్ ఛాన్స్. అంగన్వాడీ పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్స్, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో 9 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్ వాడీల నియామకాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది.

గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం అంగన్ వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఇటీవల అంగన్ వాడీలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు ఆమె స్పష్టం చేశారు.

Show comments