Dharani
CS Santhi Kumari-School Holidays: ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి వాన దంచి కొడుతుంది. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారి సెలవులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..
CS Santhi Kumari-School Holidays: ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి వాన దంచి కొడుతుంది. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారి సెలవులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా.. శుక్రవారం అర్థరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం కారణంగా రోడ్లు కొట్టుకుపోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక హైదరాబాద్ ను అయితే వాన వదలడం లేదు. గ్యాప్ ఇవ్వకుండా కురుస్తూనే ఉంది. దాంతో నగర వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలపై తెలంగాణ సీఎస్ శాంతి కుమారి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని శాంతి కుమారి హెచ్చరించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. పరిస్థితి సమీక్షించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌కి అప్డేట్ చేయాలని సీఎస్ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిచిపోవటంతో.. చాలా మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను కూడా.. తిరిగి ఇంటికి పంపించేశారు. అంతేకాక మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచన ఉన్న నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవుల అంశంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.
మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు ఈ రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అంటే.. ఆగస్ట్ 31వ తేదీ.. సెప్టెంబర్ 1వ తేదీన.. ఈ రెండు రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.