Vinay Kola
Telangana: తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష చాలా సజావుగా జరిగింది. అయితే ఇందులో భాగంగా కొన్ని చక్కని పరిణామాలు జరిగాయి.
Telangana: తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష చాలా సజావుగా జరిగింది. అయితే ఇందులో భాగంగా కొన్ని చక్కని పరిణామాలు జరిగాయి.
Vinay Kola
తెలంగాణలో గ్రూప్-3 పరీక్ష సజావుగా జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 1,401 కేంద్రాల వద్ద పరీక్ష జరిగింది. 1,365 గ్రూప్-3 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పరీక్షకు దాదాపు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తెలిసింది. మొత్తం 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయట. అయితే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అలా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చాలా ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారం ఎంతో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభ్యర్ధులకు తగిన సహాయ సహకారాలను అందించడంలో తెలంగాణ పోలీసులు తమ వంతు పోషించిన పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది. పోలీసులు అంటే నిజమైన రక్షక భటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది గతంలో చాలా సార్లు కూడా నిరూపితమయ్యింది. తాజాగా మరో ఘటన నెటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఆమెను నెటిజనులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. లింగం పల్లి నుంచి పరీక్ష కేంద్రానికి ఓ మహిళా అభ్యర్ధి వచ్చింది. అయితే ఆమెకు ఒక 5 నెలల పసి కందు ఉంది. ఆమె తన బిడ్డని తీసుకొని లోపలకి వెళ్ళి పరిక్ష రాయడం కష్టం కాబట్టి.. తన 5 నెలల పసి కందుకు తల్లిలా మారింది అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్. ఆ మహిళ పరీక్ష రాసి తిరిగి వచ్చే దాకా తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడింది ఆ లేడీ కానిస్టేబుల్. ఆ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తూ చాలా చక్కగా చూసుకుంది. ఆ బిడ్డకి అమ్మలా మారి ఆమె చేసిన ఈ మంచి పనికి నెటిజెన్స్ సెల్యూట్ కొడుతున్నారు. ఇలాంటి పోలీసులే సమాజానికి కావాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోలీసులు సమాజంలో ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.
తాను పరీక్ష రాసే దాకా తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నందుకు ఆ మహిళా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. తన బిడ్డని పోలీసులు కంటికి రెప్పలాగా చూసుకోవడం వల్ల తాను లోపల ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాశానని ఆ మహిళా తెలిపింది. తన బిడ్డని చూసుకున్నందుకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ మహిళా కానిస్టేబుల్ హెల్పింగ్ నేచర్ కి నెటిజెన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి పోలీసులు మన సమాజంలో ఉండటం నిజంగా మన అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చక్కని ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.