Vinay Kola
Telangana: దసరా వేళ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు మందుబాబులు. రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
Telangana: దసరా వేళ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు మందుబాబులు. రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
Vinay Kola
తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండగల్లో ఒకటి దసరా. విజయ దశమి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఫెస్టివల్. దసరా పండగ సెలబ్రేషన్స్ గత పది రోజుల ముందు నుంచే షురువయ్యాయి. అప్పటినుంచే దసరా సంబరాలు ఆకాశాన్ని తాకాయి . ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సోంతూళ్లకు పయనమయ్యారు. ముందు నుంచే కుటుంబంతో కలిసి దసరా ఉత్సవాలను జరుపుకునేందుకు రెడీ అయ్యారు. దసరా ముందు దాకా బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కిక్కిరిసిపోయాయి. పండక్కి కొత్త బట్టలు, నగలు, కొత్త వాహనాలు కొనుక్కునే వారితో ఆయా షాపులు కళకళలాడిపోయాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వర్షం కురిపించాయి. అయితే దసరా పండగ తెలంగాణలో చుక్క, ముక్క లేనిదే పూర్తవదు. దసరా రోజున మటన్, చికెన్, మందు ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మామూలు రోజుల్లోనే మద్యం తీసుకోకుండా ఉండలేరు. అలాంటిది పండగ పూట ఊరుకుంటారా? అప్పు తెచ్చుకోని అయినా సరే దసరాను ధూం ధాం గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. చుక్క పడనిదే పొద్దు గడవని మద్యం ప్రియులు ఎంతో మంది ఉంటారు. ఎప్పుడెప్పుడు వైన్స్ షాపులు తెరుస్తారా? అని చూస్తుంటారు. అలాంటిది దసరా ఉత్సవాల్లో మద్యం ఏరులై పారుతుంది. మంచి నీళ్లు తాగినట్టుగా కాటన్ల కొద్ది బీర్లను తాగేస్తుంటారు. బావ బామ్మర్ధులు, ఫ్రెండ్స్ సిట్టింగ్ ఏశారంటే చాలు బీర్లు, మద్యం బాటిల్లు ఖాళీ కావాల్సిందే.
దసరా పండగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు వైన్స్ షాపులకు క్యూ కడతారు. దసరా ముందు నుంచే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. మందుబాబుల తాకిడితో మద్యం నిల్వలు ఖాళీ అవుతుంటాయి. దసరా పండగ వేల రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుంది. కొద్ది రోజుల్లోనే ఏకంగా కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరుగుతుంది. ఈ సారి విజయదశమి ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. దసరా వేడుకల వేళ అమ్మకాల జోరు పెరిగింది. తెలంగాణలో కేవలం 7 రోజుల్లోనే 7 వందల కోట్ల పైగా మద్యం అమ్ముడైపోయింది. 7 వందల కోట్లను మద్యం రూపంలో తాగేశారు మందు బాబులు. బాక్సాఫీస్ రికార్డుల మాదిరిగా మద్యం అమ్మకాలు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక పండగ పూర్తయ్యే నాటికి మద్యం సేల్స్ లో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఏకంగా వెయ్యి కోట్ల రికార్డుని అవలీలగా దాటేసింది. అక్టోబర్ 12న దసరా పండగ కాబట్టి మద్యం అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. ఇంటికొచ్చిన బంధువులకు మర్యాదలు చేసేందుకు బీర్లు, మందు బాటిళ్లను ఒక రేంజిలో కొనుగోలు చేశారు.
దసరా ముందు రోజ అనగా శుక్రవారం దాదాపుగా రూ.205 కోట్ల స్టాక్ ఎక్సైజ్ డిపోల నుంచి చేరిందని తెలిసింది. దసరా పండుగ రోజుల్లో మిగతా రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. అక్టోబర్ 10న అయితే ఏకంగా రూ.139 కోట్ల మద్యం వైన్ షాపులకు చేరింది. ఇదిలా ఉండగా అక్టోబర్ 1 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏకంగా రూ.1,057.42 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడైందని అధికారులు వెల్లడించారు. ఇక ఇందులో 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని తెలిసింది. ఇందులో ఈ నెల 10వ తేదీ దాకా రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. మరి తెలంగాణలో 11 రోజుల్లో 1,057.42 కోట్ల మద్యం అమ్మకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.