ఇలా కూడా ఉంటారా?.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌!

హైదారబాద్ లో ర్యాపిడో బైక్ రైడర్ కు ఊహించని వింత అనుభవం ఎదురైంది. బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. అయినా కస్టమర్ బండి దిగకపోవడంతో బంకు వరకు తోసుకుంటూ వెళ్లాడు.

హైదారబాద్ లో ర్యాపిడో బైక్ రైడర్ కు ఊహించని వింత అనుభవం ఎదురైంది. బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. అయినా కస్టమర్ బండి దిగకపోవడంతో బంకు వరకు తోసుకుంటూ వెళ్లాడు.

హైదరాబాద్ మహానగరంలో బైక్ ట్యాక్సీల ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు ప్రైవేట్ రవాణారంగంలో దూసుకెళ్తున్నాయి. బైక్ ట్యాక్సీ సేవలకు నగరంలో మంచి ఆదరణ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి క్షణాల్లో బైక్ బుక్ చేసుకుని సులభంగా వెళ్లొచ్చు. ధరలు తక్కువ, ఫోన్లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుచే బైక్ రావడంతో ప్రయాణికులు బైక్ ట్యాక్సీలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ ర్యాపిడో డ్రైవర్ కు వింత అనుభవం ఎదురైంది. కస్టమర్ చేసిన పనికి అతనికి ఏం చేయాలో తోచక రోడ్డుపై చుక్కలు చూశాడు. బైక్ లో పెట్రోల్ అయిపోయినా కస్టమర్ మాత్రం బైక్ దిగలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

బైక్ ట్యాక్సీల్లో ఒకటైన ర్యాపిడోను ప్యాసింజర్లు ఎక్కువగా బుక్ చేసుకుంటుంటారు ఎందుకంటే.. మిగతా వాటికంటే ఇందులో ధర కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా బుక్ చేసుకుంటే అలా వాలిపోతున్నారు బైక్ రైడర్లు. హైదరాబాద్ లో ర్యాపిడో బైక్ రైడర్ కు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. కస్టమర్ ను బైక్ పై ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరారు. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ లో పెట్రోల్ అయిపోయింది. దీంతో బైక్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేకపోవడంతో దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుకు బైకును తోసుకుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు బైక్ రైడర్.

కాగా బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ను బైక్ రైడర్ కోరాడు. నడుచుకుంటూ వచ్చేందుకు కస్టమర్ తిరస్కరించాడు. దీంతో చేసేదేం లేక అతడిని బైక్ పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకు వెళ్లాడు. ఈ తతంగాన్నంతా వారి వెనకాలే వస్తున్న కారులోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు జనాలు ఇలా కూడా ఉంటారా? బంకు వరకు కూడా నడుచుకుంటూ వెళ్లలేరా అంటూ కామెంట్ చేస్తున్నారు. రానురాను మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పెట్రోల్ అయిపోయినా కస్టమర్ బైక్ దిగకుండా అలాగే కూర్చుండిపోయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments