ఇంకా వెంటాడుతున్న రాడిసన్ డ్రగ్ కేసు

ఇంకా వెంటాడుతున్న రాడిసన్ డ్రగ్ కేసు

డ్రగ్స్ కంట్రోల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. అయినా జరిగే వ్యవహారం గుట్టుమట్టుగా జరుగుతోందనే ప్రైమరీ ఇన్ఫర్ మేషన్ బేస్ తో తెలంగాణ పోలీసులు ఊరుకున్నట్టే ఉంటారు గానీ, సైలెంట్ గా దానిమీద జరగాల్సిన పంచాయితీలు జరుపుతూనే ఉన్నారు.

డ్రగ్స్ కంట్రోల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. అయినా జరిగే వ్యవహారం గుట్టుమట్టుగా జరుగుతోందనే ప్రైమరీ ఇన్ఫర్ మేషన్ బేస్ తో తెలంగాణ పోలీసులు ఊరుకున్నట్టే ఉంటారు గానీ, సైలెంట్ గా దానిమీద జరగాల్సిన పంచాయితీలు జరుపుతూనే ఉన్నారు.

ఆ మధ్య రాడిసన్ హోటల్ జరుగుతున్న నైట్ పార్టీలో డ్రగ్స్ వాడకం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై దాడులు చేశారు. చాలా మందిని కస్టడీలోకి తీసుకున్నారు. కొందరు సినిమా పరిశ్రమకి సంబంధించిన మహామహులైతే, మరి కొందరు చోటామోటాగాళ్ళు. కానీ, నేరంగా పరిగణించబడే ఏ అంశానికి కూడా చిన్నాపెద్ద అని ఉండదు. కళ్ళకు కనిపించినది కొంతైతే, దాని మూలాల కోసం మరింత నిఘా పెరిగి, అన్వేషణలు ఊపందుకుంటాయి. గతంలో కూడా రవితేజ బ్రదర్ కూడా ఇటువంటి వ్యవహారంలో చిక్కుకున్నాడు. నవదీప్ మీద తీవ్రమైన అబియోగాలు నమోదయ్యాయి. చివరికి పూరీ జగన్నాథ్ లాంటి అగ్రదర్శకులను కూడా ఫోలీసులు వదలి పెట్టలేదు.

విచారణ నిమిత్తం పోలీసులు పిలిచినప్పుడు డ్రగ్ కేసుతో సంబంధముందన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న కొందరు తెలివితేటలతో తప్పించుకునే పనిలో, కట్టుకథలు చెప్పి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని పోలీసుల ఉద్దేశ్యం. అందులో ముఖ్యంగా ప్రతిష్టాత్మక దర్శకుడిగా పేరు పొందిన క్రిష్ ని రమ్మంటే షూటింగ్ లో బిజిగా ఉన్నానని చెప్పి, విచారణకి దూరంగా ఉంటున్నాడని సమాచారం. రిషి కనబడడంల లేదని, రిషి సిస్టర్ ఖుషిత చెబుతోందట. నీల్ అయితే ఏకంగా విదేశాలకు వెళ్ళిపోయాడని అంటున్నారు. డ్రగ్ కేసులో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్న నీల్ కి ఫారెన్ టూర్ కి క్లియరెన్స్ ఎలా వచ్చిందనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్. తప్పు అడ్రస్ ఇచ్చి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుందట శ్వేత. ల్యాండ్ సెటిల్ మెంట్ ఉందని, ఏకంగా లాయర్లతో పాటు ప్రత్యక్షమయ్యాడు రఘుచరణ్.

ఏదో విధంగా ఈ ఉచ్చులోనుంచి తప్పించుకుని, బైటపడాలని తెగ తాపత్రయపడుతూ, కుంటిసాకులు, సినిమా ఫక్కీ సమాధానాలతో విచారణలకు గైర్హాజరు అవుతున్నారని పోలీసు విభాగం చెబుతోంది. ఆ మధ్యన సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దలు ఈ డ్రగ్స్ వ్యవహారం వల్ల పరిశ్రమ ప్రతిష్టకి భంగం కలుగుతోందని కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి తీవ్రంగా ఆలోచించారు. కానీ, సినిమా పరిశ్రమతో పాటు టీవీ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తునే పరుచుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎలా హేండిల్ చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఎక్కడ ఏ డ్రగ్ సంచలనం రేగినా, ఏదో మూల నుంచి అది సినిమా పరిశ్రమకి చుట్టుకుంటోంది. ఓ పక్కన తెలుగు సినిమా బాలీవుడ్ ని కూడా తలదన్ని, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తరుణంలో ఇటువంటి అగౌరవం తెలుగు పరిశ్రమ తలకి చుట్టుకోవడాన్ని మాత్రం సినిమా పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా, ఇటువంటి కేసులలో పెద్దల పేర్లే వినిపించడం కూడా నివారించుకోలేని ప్రమాదమై కూర్చుంది.

Show comments