P Venkatesh
రీల్స్ చేసే వారికి అలర్ట్. ఒక్క రీల్ తో ఫేమస్ అవ్వాలని ఇష్టారీతిలో రీల్స్ చేస్తున్నారా? అయితే మీకు జైలే ఇక. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా రీల్స్ చేస్తే అరెస్టు తప్పదు జైలు తప్పదంటున్నారు పోలీసులు.
రీల్స్ చేసే వారికి అలర్ట్. ఒక్క రీల్ తో ఫేమస్ అవ్వాలని ఇష్టారీతిలో రీల్స్ చేస్తున్నారా? అయితే మీకు జైలే ఇక. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా రీల్స్ చేస్తే అరెస్టు తప్పదు జైలు తప్పదంటున్నారు పోలీసులు.
P Venkatesh
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది. సామాన్యులను సైతం సెలబ్రిటీలను చేస్తున్నది సోషల్ మీడియా. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఇన్ట్సాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిల్లో వీడియోలు చేస్తూ అప్ లోడ్ చేస్తున్నారు. వ్యూస్, కామెంట్స్ కోసం వికృత చేష్టలతో రీల్స్ చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నడిరోడ్డుపై డ్యాన్సులు, పబ్లిక్ కు ఇబ్బంది కలిగేలా రీల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు. ఇలా చట్ట విరుద్దంగా రీల్స్ చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇకపై మీరు కూడా ఇలా రీల్స్ చేస్తే జైలు శిక్ష తప్పదంటున్నారు అధికారులు.
ఇన్ట్సా రీల్స్ పేరుతో ప్రమాదకర స్థితిలో స్టంట్స్ చేస్తూ హల్ చేస్తున్నారు. అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. క్రియేటివ్ కంటెంట్ తో సమాజానికి ఉపయోగ పడేలా రీల్స్ చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా, రెచ్చగొట్టేలా రీల్స్ చేస్తే పోలీసులు తీసుకునే చర్యలకు గురికావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు మారణాయుధాలతో రీల్స్ చేస్తూ హల్ చల్ చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఈ వీడియోలు పోలీసుల కంట పడడంతో ఆ ముగ్గురు ఆకతాయిలను అరెస్టు చేశారు.
నిర్మల్ జిల్లాలో ముగ్గురు యువకులు ఫేమస్ అయ్యేందుకు మారణాయుధాలతో రీల్స్ చేశారు. రివాల్వార్ లోడ్ చేసి కాల్పులు జరుపుతున్నట్లు, గన్ తలకు గురిపెట్టుకుంటూ వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తల్వార్, కత్తులతో ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ వ్యక్తిగత ఖాతాల్లో పోస్టులు పెట్టారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి కాస్త పోలీలసుల వద్దకు చేరాయి. ఈ విధంగా రీల్స్ చేయడంపై సీరియస్ అయిన పోలీసులు ఆ ముగ్గురు ఆకాతాయిలను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి మీరు కూడా ఈ రకంగా రీల్స్ చేసినట్లైతే అరెస్టు తప్పదు, జైలుకెల్లడం తప్పదంటున్నారు పోలీసులు. ఫేమస్ అవుదామనుకుని పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తే ఊచలు లెక్కించాల్సి వస్తుందంటున్నారు అధికారులు.