Dharani
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తన క్యూట్ ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు మోదీ. ఆ వివరాలు. .
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తన క్యూట్ ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు మోదీ. ఆ వివరాలు. .
Dharani
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా నుంచి ఏవైనా పోస్ట్ చేసినా.. ఎవరి గురించి అయినా ప్రస్తావించినా.. వారు ఎంతో ప్రత్యేకం అని అర్థం అవుతుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మోదీ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇక్కడ దృష్టి పెట్టారు. ఏపీ, తెలంగాణలో వరస సభలు నిర్వహిస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా.. కరీంనగర్, వరంగల్‌లో పర్యటించిన నరేంద్ర మోదీ బిజీ బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన తన క్యూట్ ఫ్రెండ్‌ని పరిచయం చేశారు. వరంగల్‌లో నా క్యూట్ ఫ్రెండ్‌ని కలిశాను అంటూ ఫొటో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరలవుతోంది. ఇంతకు మోదీ క్యూట్ ఫ్రెండ్ ఎవరంటే..
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. కరీంనగర్, వరంగల్‌లో పర్యటించారు. బిజీ బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఓ చిన్నారిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు మోదీ. తాను కూడా ఓ పిల్లాడిలా మారి.. ఆ పిల్లాడిని ఆడిస్తూ.. సంతోషపడ్డారు. అంతేకాక ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆడిస్తున్న ఫొటోని మోదీని స్వయంగా తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోని షేర్ చేసిన మోదీ.. “వరంగల్‌లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడి, క్యూట్ ఫ్రెండ్‌ని కలిశాను” అంటూ తెలుగులో రాయటంతో పాటు స్మైలీ ఎమోజీని కూడా జోడించారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ” మోదీజీ మీ క్యూట్ ఫ్రెండ్ బాగున్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న కూడా అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న సమయంలో.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని సరదాగా ఆడించారు మోదీ. అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొడనానికి రాష్ట్రానికి వచ్చిన మోదీ.. అంతకు ముందు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దివ్యక్షేత్రాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కును కూడా చెల్లించుకున్నారు. ఆలయమంతా కలియతిరిగి.. పరిశీలించారు. అనంతరం.. వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అవినీతిలో ఫెవికాల్ బంధమంటూ దుయ్యబట్టారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ.. తెరవెనుక మాత్రం సిండికేట్‌గా మారుతారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను. 😀 pic.twitter.com/raQhGyMrx6
— Narendra Modi (@narendramodi) May 8, 2024