Keerthi
ప్రస్తుతం కాలంలో చాలామంది ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అధికారులను, బ్రోకారులను అనుసరించి వారిని మేనెజ్ చేసి టెస్ట్ పాసవ్వకుండా.. లైసెన్స్ పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మరి, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకున్న అడ్డదారుల్లో లైసెన్స్ పొందే పద్ధతికి చెక్ పెడుతూ మరో కొత్త పరీక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.
ప్రస్తుతం కాలంలో చాలామంది ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అధికారులను, బ్రోకారులను అనుసరించి వారిని మేనెజ్ చేసి టెస్ట్ పాసవ్వకుండా.. లైసెన్స్ పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మరి, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకున్న అడ్డదారుల్లో లైసెన్స్ పొందే పద్ధతికి చెక్ పెడుతూ మరో కొత్త పరీక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.
Keerthi
ప్రస్తుతం కాలంలో యువకులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా చాలామంది వాహనాలు నడుపుతున్నారు. అయితే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్పొందాలంటే నెల రోజుల పాటు డ్రైవింగ్ సూళ్లలో శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఆర్టీఏకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే వారు పెట్టే పరీక్షలో పాసైన వారికి తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారు. ఇక అక్కడికి ఆరు నెలల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లోని టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్‌లో వాహనాలను నడిపి చూపిస్తేనే శాశ్వత లైసెన్స్ ఇస్తారు. కానీ, కొంతమంది మాత్రం ఇలా ఆర్టీఏ ఆఫీసులు చూట్టూ టెస్ట్ పాసై లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బంది, కష్టం అని భావించి కొంతమంది అడ్డదారులు తొక్కుతారు. ముఖ్యంగా సరిగ్గా వావానాలను నడపలేకపోయినా వారు కూడా అధికారులను మేనేజ్ చేస్తే చాలు లైసెన్స్ అనేది ఈజీగా బ్రోకర్లతో టెస్టు లో ఫెయిల్ కాకుండా పొందవచ్చు.ఇక ఇలా పూర్తి నైపుణ్యం లేని వారికి కూడా లైసెన్స్ జారీ అవుతున్నాయి. కానీ, ఇకపై ఆ పద్ధతులు కొనసాగవని నగరంలో తాజాగా ఆర్టిఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ ను ప్రవేశపెట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులను టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. దీంతో టెస్ట్ డ్రైవింగ్‌కు వచ్చేవారు దొడ్డిదారిలో లైసెన్స్పొందే పద్ధతి చెక్ పెట్టాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పని సరిగా టెస్ట్ రాయాల్సిందేనని చెప్తున్నారు. అలాగే డ్రైవింగ్‌లో బాగా శిక్షణ తీసుకుని నైపుణ్యంతో టెస్ట్‌లో పాసైన వారికే లైసెన్స్జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
లైసెన్స్ కోసం ఆర్టీఏ జారీ చేసిన కొత్త పద్ధతులు :
మరి, అడ్డదారుల్లో లైసెన్స్ పొందాలనుకునే పద్ధతికి చెక్ పెడుతూ ఆర్టీఏ తీసుకువచ్చిన ఈ కొత్త ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.