అమీర్‌పేట్‌ హాస్టల్స్‌లో ఉండేవారు జాగ్రత్త! ఈ తప్పు చేస్తే 2 లక్షలు పోయినట్టే

Beware Of These Fraudsters Who Cheating Students In The Name Of Backdoor Jobs: అమీర్ పేట్ హాస్టల్స్ లో ఉండే వారికి అలర్ట్. ఈ చిన్న తప్పు కనుక చేస్తే మీరు 2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువే కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయకండి.

Beware Of These Fraudsters Who Cheating Students In The Name Of Backdoor Jobs: అమీర్ పేట్ హాస్టల్స్ లో ఉండే వారికి అలర్ట్. ఈ చిన్న తప్పు కనుక చేస్తే మీరు 2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువే కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయకండి.

మీరు అమీర్ పేట్ హాస్టల్స్ లో ఉంటున్నారా? పీజీ హాస్టల్స్ లో ఉంటున్నారా? అయితే జాగ్రత్త. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మీకు తెలియకుండానే మీ డబ్బు చేజారిపోతుంది. లక్షలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇంజనీరింగ్, డిగ్రీలు పూర్తి చేసిన స్టూడెంట్స్ హైదరాబాద్ వస్తే చేరేది అమీర్ పేట్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ లోనే. ఆ తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చేరి సాఫ్ట్ వేర్ కోడ్ లాంగ్వేజ్ లు నేర్చుకుంటారు. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొంతమంది స్కామ్ లకి పాల్పడుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గానీ మీరు లక్షలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు అస్సలు చేయకూడదు.

స్కామ్స్ ఇలా చేస్తారు: 

ఏడాదిలో 4, 5 కోట్లు సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకుని ఒక గ్యాంగ్ వస్తుంది. ఏదో పేరు మీద సాఫ్ట్ వేర్ కంపెనీ అని రిజిస్టర్ చేయిస్తారు. డబ్బులు చెల్లించి ఆఫీస్ స్పేస్ తీసుకుంటారు. ఆ తర్వాత ఫర్నీచర్ కొంటారు. కొన్ని సిస్టమ్స్ సెట్ చేసి సాఫ్ట్ వేర్ కంపెనీ నడుస్తున్నట్టే బిల్డప్ ఇస్తారు. తర్వాత ప్రాజెక్ట్స్ వస్తున్నట్టు విద్యార్థుల దగ్గరకు వెళ్లి మార్కెటింగ్ చేస్తారు. అమీర్ పేట్, మైత్రీవనం దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్, పీజీ హాస్టల్స్ లో ఉండే వారి దగ్గరకు వెళ్తారు. జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారినే టార్గెట్ చేస్తారు. బ్యాక్ డోర్ జాబ్ ఆశ చూపించి రెండు లక్షలు అడుగుతారు. అలా వంద, రెండు వందల మంది దగ్గర రెండేసి లక్షలు చొప్పున తీసుకుంటారు. ఉదాహరణకు 200 మంది దగ్గర రెండేసి లక్షలు వసూలు చేశారనుకుంటే 4 కోట్లు వస్తాయి. డబ్బులు తీసుకున్నారు కాబట్టి కాదు.. విద్యార్థులు గోల చేస్తారు కాబట్టి వారికి జాబ్ ఇస్తారు. కానీ జీతం ఉండదు.

ఎందుకంటే 3 నెలల ట్రైనింగ్ అంటారు కాబట్టి. ట్రైనింగ్ లో అడ్డమైన కోడింగ్ లు చెప్తారు. ఆ తర్వాత 6 నెలలు ఫేక్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి 10, 15 వేలు జీతం వేస్తారు. ఆ తర్వాత రిసెషన్ (వ్యాపార మాంద్యం) అని చెప్పి చేతులెత్తేశారు. ప్రాజెక్ట్స్ రావడం లేదు వేరే జాబ్ చూసుకోండి అని చెప్తారు. వేరే దారి లేక వేరే జాబ్ కోసం వెతుక్కుంటారు. అయితే ఇక్కడ మొదట్లో 3 నెలల ట్రైనింగ్, తర్వాత 6 నెలల చేసిన పని లెక్కలోకి రాదు. ఈ అనుభవం వేరే జాబ్ కోసం ఉపయోగపడదు. ప్రస్తుతం అమీర్ పేట్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఫేక్ కంపెనీ పెట్టుకుని లక్షలు పెట్టుబడి పెట్టి ఏడాదిలో కోట్లు సంపాదించేసుకుని ఉడాయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి స్కామ్ లు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఇలాంటి వాళ్ళని నమ్మి చాలా మంది లక్షలు కోల్పోతున్నారు. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ అని ఎవరైనా వస్తే అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వారి ట్రాప్ లో పడకండి.

Show comments