Lok Sabha Election Results 2024: ఎలక్షన్ రిజల్ట్స్: నల్లగొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. 5 లక్షలకు పైగా..

ఎలక్షన్ రిజల్ట్స్: నల్లగొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. 5 లక్షలకు పైగా..

Lok Sabha Election Results 2024: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ గట్టి పట్టుమీదే ఉన్నాయి. ఇప్పటి వరకు చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Lok Sabha Election Results 2024: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ గట్టి పట్టుమీదే ఉన్నాయి. ఇప్పటి వరకు చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో మే 13 న జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న చందంగా పోటా పోటీగా నిలిచాయి. ఇప్పటి వరకు ఇరు పార్టీలు చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ఖాతానే తెరవలేదు.. ఇక ఎంఐఎం ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ మెజార్టీతో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామ‌సహాయం రఘరాంరెడ్డి ఇప్పటి వరకు 3.5 లక్షలకు పైగా మెజార్టీ తో విజయం సాధించారు. ఇక నల్లగొండ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తుంది.. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో మెజార్టీతో దూసుకుపోతుంది. వివరాల్లోకి వెళితే..

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరా రెడ్డి భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయనకు 5,41,241 మెజార్టీ మార్క్ దాటనున్నారు.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి ఓట్ల మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రఘువీరా రెడ్డి సోదరుడు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరోవైపు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 1.85 లక్షల ఆదిక్యంలో ఉన్నారు.

ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే విజయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, ధర్మ పురి అర్వింద్ తదితరులు లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. మల్కాజ్ గిరి నుంచి ఈటెల రాజేందర్ 2 లక్షల మెజార్టీతో కొనసాగుతున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు, సికింద్రబాద్ నుంచి కిషన్ రెడ్డి దాదాపు 70 వేల మెజార్టీతో కొనసాగుతున్నారు.

Show comments