Arjun Suravaram
Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ఓ ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై రాష్ట్ర మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు.
Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ఓ ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ పై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై రాష్ట్ర మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు.
Arjun Suravaram
ఈ మధ్య కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ ల వివాదలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల ట్రైనీ ఐఏ ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన ఓ ట్వీట్ వివాదం అయ్యింది. ఆమె చేసిన కామెంట్స్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే సివిల్స్ మెంటర్ బాలలత స్మితా సబర్వాల్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసింది. తాజాగా ఈ ఐఏఎస్ అధికారిణి కామెంట్స్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ వికలాంగుల కోటాపై ఓ ట్వీట్ చేశారు. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం నేపథ్యంలో అఖిల భారత సర్వీసెస్ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. సివిల్ సర్వీస్ ఎంపిక విధానంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్విట్ పై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో వారి అభిప్రాయాలకు స్మితా కూడా సమాధానం చెప్తుండటం గమనార్హం.
తాజాగా స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. మంగళవారం మంత్రి సీతక్క స్మితా సభర్వాల్ వివాదంపై స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు అంటే బాధ్యతగా ఉండాలని స్మితాకు సూచించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి దివ్యాంగులపై అలా మాట్లాడడం సరైనది కాదని మంత్రి సీతక్క అన్నారు. ఇలా ఎవరు కూడా వైకల్యాన్ని కించపరచవద్దని తెలిపారు. దివ్యాంగులపై ఇలాంటి కామెంట్స్ చేసి వాళ్లు బుద్ది వైకల్యాన్ని చూపిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్మిత సబర్వాల్ ఇష్యూ సీఎం రేవంత్ నోటీసులో ఉన్నాయన్నారు.
సోమవారం స్మితా సభర్వాల్ పై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారైన సంగతి తెలిసిందే. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మితాకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని బాలలత ప్రశ్నించారు. “ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావా” అంటూ స్మిత సభర్వాల్ కు బాలలత సవాల్ విసిరారు. అసలు క్షేత్ర స్థాయిలో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందని బాలలత ప్రశ్నించారు. మొత్తంగా స్మితా సభర్వాల్ ట్వీట్ పై తాజాగా ఏకంగా రాష్ట్ర మంత్రినే రియాక్ట్ అయ్యారు.