Dharani
KTR Distributed Laptops To Students: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన పుట్టినరోజు సందర్భంగా మంచి మనసు చాటుకున్నారు. సుమారు 100 మంది విద్యార్థినులకు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. ఆ వివరాలు..
KTR Distributed Laptops To Students: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన పుట్టినరోజు సందర్భంగా మంచి మనసు చాటుకున్నారు. సుమారు 100 మంది విద్యార్థినులకు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. ఆ వివరాలు..
Dharani
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పొలిటికల్ పరంగానే కాక.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, కార్యకర్తలతో కనెక్ట్ అవుతుంటారు. ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పందిస్తూ.. వారిని ఆదుకుంటారు. ఇక తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. ఏకంగా వంది మంది విద్యార్థినిలకు ఖరీదైన కానుక అందించి.. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. ఆ వివరాలు..
తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. 100 మంది విద్యార్థినులకు ఊహించని బహుమతి ఇచ్చి.. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమయ్యారు. బర్త్‌డే సందర్భంగా కేటీఆర్.. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అక్కడే కేక్ కట్ చేసి.. విద్యార్థినులకు తినిపించారు. అంతేకాక గత కొన్నేళ్లుగా తన బర్త్‌డే సందర్భంగా కొనసాగిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా.. స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందించారు కేటీఆర్. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన బహుమతిపై విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల మధ్య నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో కేటీఆర్‌తో పాటు ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
ఇక విద్యార్థినులంతా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక తమకు ఎంతో విలువైన ల్యాప్‌టాప్‌లు అందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు.. ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కూడా కేటీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. మృతి చెందిన నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక గతేడాది బర్త్‌డే సందర్భంగా స్టేట్ హోం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. అయితే ఎన్నికల వల్ల ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఆ పని ఇప్పుడు పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. ఇక ఐదేళ్లుగా తాను చేస్తున్న ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పుకొచ్చారు కేటీఆర్.
ఐదేళ్ల క్రితం అనగా 2020లో తన బర్త్‌డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. తన పుట్టినరోజు వేడుకలు.. ఇతరుల ముఖాల్లో చిరునవ్వుకు కారణమవ్వాలన్న సంకల్పంతోఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది కరోనా సమయం కావటంతో.. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో గిఫ్ట్ ఏ స్టైల్ కార్యక్రమంలో భాగంగా.. ఎంతో మందికి తనకు తోచిన సాయం చేస్తూ.. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఎన్నో అంబులెన్స్‌లతో పాటు.. సుమారు 6,000 మంది విద్యార్థులకు ట్యాబ్లెట్లను అందించారు. 1,400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించారు. ఈసారి ఏకంగా 100 మందికి ల్యాప్‌టాప్‌లు అందించి తన మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్.