బ్రేకింగ్: కేసీఆర్ హెల్త్ అప్డేట్… వైద్యులు ఏమన్నారంటే?

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... ఈ నెల 3న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... ఈ నెల 3న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో వరుసగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రం ఫామ్ హౌజ్ లో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజీగుడలోని యశోద హాస్పిటల్ కి తరలించారు. కేసీఆర్ ని పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆపరేషన్ కి కావాల్సిన పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్ కి వెళ్లి అక్కడే సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి వెళ్లి కలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ కి వెళ్లారు. దశాబ్ద కాలం పాటు పానల కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు ప్రజాదరణ కోల్పోయిందన్న విషయంపై పార్టీ నేతలు, కార్యకర్తలను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారంలో లేకున్నా ప్రతిపక్ష హోదాలు ప్రజల మనసు మరోసారి గెలవాలని గెలిచిన ఎమ్మెల్యేలకు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. నిన్న రాత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ బాత్రూమ్ లో జారిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయనకు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయనున్నట్లు యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ కి గాయమై ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకొని పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఓడిపోయిందని కొంతమంది నేతలు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ మద్యనే జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి హార్ట్ ఎటాక్ తో కన్నుముశారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు.

Show comments