బాలలత కామెంట్స్ పై స్పందించిన IAS అధికారిణి స్మితా సబర్వాల్!

Smita Sabharwal: సివిల్స్ లో వికలాంగుల రిజర్వేషన్లపై ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత చాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు.

Smita Sabharwal: సివిల్స్ లో వికలాంగుల రిజర్వేషన్లపై ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత చాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసి ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇటీవలే సివిల్స్ లో వికలాంగుల రిజర్వేషన్లపై చేసిన ట్వీట్లతో రచ్చ మొదలైంది. ఐఏఎస్ ఆఫీస్ స్మితా చేసిన కామెంట్స్ పై కొందరు ఆమెకు మద్దతు ఉండగా, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సివిల్స్ మెంటర్ బాలలత.. స్మితా సబర్వాల్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసింది. ఇప్పుడు నాతో ఎగ్జామ్ రాస్తావా అంటూ బాలలత .. ఐఏఎస్  అధికారిణి స్మితాకు ఛాలెజ్ చేసింది. ఇక బాలలత చేసిన కామెంట్స్ పై స్మితా సబర్వాల్ రియాక్ట్ అవుతూ మరో ట్వీట్ చేశారు.

కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్  వికలాంగుల కోటాపై  ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికెట్లతో క్రిమిలేయర్ కింద ఐఏఎస్ కి ఎంపికైంది. దీనిపై జరిగిన వివాదం నేపథ్యంలో అఖిల భారత సర్వీసెస్ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ స్మితా సబర్వాల్  ట్వీట్ చేశారు. సివిల్ సర్వీస్ ఎంపిక విధానంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్విట్ పై పలువురు విమర్శలు చేస్తుంటే వారికి కూడా ఆమె సమాధానం చెప్తుండటం గమనార్హం.

అదే విధంగా రెండు రోజుల క్రితం సివిల్స్ మెంటర్ బాలలత కూడా స్మితా సబర్వాల్ ట్వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆమెకు ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మితాకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని బాలలత ప్రశ్నించారు. “ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావా” అంటూ స్మిత సభర్వాల్ కు బాలలత సవాల్ విసిరారు. తాజాగా ఆమె ఛాలెంజ్ పై స్మితా సబర్వాల్ రియాక్ట్ అవుతూ తాజాగా మంగళవారం మరో ట్వీట్ చేశారు.

ఐఏఎస్  కోచింగ్ నిర్వాహకురాలు బాలలత ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. అయితే, ఇప్పుడు సివిల్స్  రాయడానికి తనకు వయస్సు లేదని, యూపీఎస్సీ నిబంధనలు  ఒప్పుకోవని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాక మరికొన్ని అంశాలను స్మితా సబర్వాల్ ప్రస్తావించారు. ఇక వికలాంగుల రిజర్వేషన్ ను ప్రజల కోసం ఉపయోగించారా? లేదా సివిల్స్  కోచింగ్  ఇన్ స్టిట్యూట్  నడపడానికా? అని బాలలతను ఆమె ప్రశ్నించారు. తన ప్రశ్నలకు బాలలత సమాధానం ఇవ్వాలని స్మితా సబర్వాల్ డిమాండ్  చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments