Hyderabad వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళ్లకండి..!

Traffic Restrictions-Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలు..

Traffic Restrictions-Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్ వాసులను వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్. సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఓ మాదిరిగా ఉంటే.. వర్షం పడితే చాలు.. చుక్కలు కనిపిస్తాయి. నాలుగు చినుకులు పడ్డా చాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడి.. ఇళ్లకు చేరడానికి గంటల సమయం పడుతుంది. ఇక గత మూడు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఎక్కడ చూడు మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరి.. నగర వాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సోమవారం నాడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని.. దాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఆ వివరాలు..

హైదరాబాద్ నగర ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. నేడు అనగా మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వేదికగా.. నేటి నుంచి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024  మూడ్రోజుల పాటు జరగనుంది. సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో జీఎంసీబీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, ట్రిపుల్ఐటీ సర్కిల్ నుంచి విప్రో రూట్‌లో ఆయా రోజుల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ రూట్లలో ప్రయాణాలు చేసి ఇబ్బందులకు గురి కావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Show comments