హైదరాబాద్: మియాపూర్‌లో ఒడిశాకు చెందిన యువతి ఆత్మహత్య..

హైదరాబాద్: మియాపూర్‌లో ఒడిశాకు చెందిన యువతి ఆత్మహత్య..

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లో ఎంతోమంది బతుకు దేరువు కోసం వస్తుంటారు. బీహార్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా వలస వస్తున్న విషయం తెలిసిందే. కూలీలు, చిరు వ్యాపారాలు, ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనులు చేస్తు జీవిస్తున్నారు. ఇటీవల కొంతమంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. హైదరాబాద్ లో విషాద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య పాల్పపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన గీతాంజలి (21)మూడేళ్లి క్రితం హైదరాబాద్ కి బతుకుదేరువు కోసం వచ్చింది. ప్రస్తుతం మియాపూర్ మయూరి నగర్ లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ఈ నెల 5వ తేదీ నుంచి కోచంగ్ సెంటర్ కు సెలవులు ఇవ్వడంతో ఆమె అక్కడ డ్యూటీ చేస్తుంది.

రోజూలాగే ఈ నెల 8వ తేదీన డ్యూటీకి వెళ్లి అదే రోజుల రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతురాలి బంధువుల వర్షన్ వేరే ఉంది. గీతాంజలి ఎంతో ధైర్యవంతురాలని.. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments