వినాయక నిమజ్జన వేళ.. Hydలో ఈ రూట్స్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Hyderabad Traffic Rules: హైదరాబాద్‌లో శనివారం(సెప్టెంబర్ 7) నుంచి వినాయక చవితి సందడి మొదలైంది. వీధి వీధిలో గణనాథుడికి స్వాగతోత్సవాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా అనే నినాదాలు మారుమోగుతున్నాయి.

Hyderabad Traffic Rules: హైదరాబాద్‌లో శనివారం(సెప్టెంబర్ 7) నుంచి వినాయక చవితి సందడి మొదలైంది. వీధి వీధిలో గణనాథుడికి స్వాగతోత్సవాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా అనే నినాదాలు మారుమోగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో వినాయ ప్రతిమలు ప్రతిష్టించి  ఉత్సవాలు  జరుపుకుంటున్నారు.  హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల మూడో రోజు నుంచి గణనాథుల విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, డ్యాన్సులతో గణేష్ ఆగమన్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. ప్రధానంగా నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు సరూర్ నగర్ చెరువు, ఉప్పల్ నల్ల చెరువులో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం జరుతుగుంది. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొనడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

గణనాథుడి నిమజ్జనం సంధర్భంగా భక్తులు పెద్దు ఎత్తున డీజే సౌండ్లు, డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేషుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం, సెప్టెంబర్ 10 నుంచి ఈ నెల 16 వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిాపరు. ఈ ఆంక్షలు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్థరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారో పూర్తి వివరాలు ఇవే.

తెలుగు తల్లి జంక్షన్ :

అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించబడదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు మళ్లించబడతాయి.

సెయిలింగ్ క్లబ్ టీ జంక్షన్ :

  • లిబర్టీ లేదా ఖైరాతాబాద్ వైపు వెళ్లే వాహనదారులు కవాడీగూడ క్రాస్ రోడ్స్, డిబిఆర్ మిల్స్, వార్త లెన్, స్విమ్మింగ్ ఫూల్, బండ మైసమ్మ, ఇందిరాపార్క్, ఆర్కే మఠ్, ధర్నా చౌక్, కట్ట మైసమ్మ జంక్షన్, అంబేద్కర్ స్టాచ్యూ లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్లాలని తెలిపారు.
  • కర్బాలా మైదాన్ నుంచి వచ్చే వాహనదారులు అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లడానికి వీలు లేదు. సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడీగూడ క్రాస్ రోడ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది
  • ట్యాంక్ బండ్ మీదుగా పంజాగుట్ట కు వెళ్లే వాహనదారులు రాణి గంజ్, మినిస్టర్ రోడ్డు, బేగం పేట మీదుగా వెళ్లాలి

వీవీ విగ్రహం :

  • పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లేందుకు అనుమతి లేదు. వాహనదారులు షాదన్ కాలేజ్, లక్డీకపూల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

డీబీఆర్ మిల్స్ :

  • కట్ట మైసమ్మ ఆలయం నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనదారులు డీబీఆర్ మిల్స్, కవాడీగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్ళిస్తారు.

కవాడీగూడ ఎక్స్ రోడ్ :

  • ముషీరాబాద్ జబ్బర్ కాంప్లెక్స్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వైపుగా అనుమతించరు. అటుగా వచ్చే వాహనదారులను కవాడీగూడ ఎక్స్ రోడ్డు వద్ద డబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.

 

Show comments