రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్!

Nagole Metro Station: నగరంలో కొంత కాలంగా ప్రయాణాల రద్దీ బాగా పెరిగిపోయింది. రోడ్డుపైకి వస్తే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు తొలగించేందుకు 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చారు.

Nagole Metro Station: నగరంలో కొంత కాలంగా ప్రయాణాల రద్దీ బాగా పెరిగిపోయింది. రోడ్డుపైకి వస్తే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు తొలగించేందుకు 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్ లో రోజు రోజుకీ జనాభా సంఖ్య పెరిగిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యల్లో వలస వస్తూ ఇక్కడే స్థిరపడుతున్నారు. దీంతో రోడ్డు ప్రయాణం చేయాలంటే రిస్క్ తో కూడుకున్న పని అవుతుంది. నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ఎక్కువ రద్దీతో పొల్యూషన్ ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు కొంతమేర తగ్గించేందుకు ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసేందుకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2017లో నాగోల్ – అమీర్ పేట్ – మియాపూర్ మార్గాల్లో ప్రారంభించబడిది. తర్వాత ఎల్ బీ నగర్- అమీర్ పేట్ మార్గాన్ని 2018 లో ప్రారంభించారు. ఇక అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గాన్ని 2019 న ప్రారంభించారు. మెట్రో ప్రయాణికుల బ్యాడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే..

ఇటీవల నగరంలో మెట్రో లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా  హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరుకు నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో వాహనాలు ఉచింగా పార్కింగ్ చేసే అవకాం ఉండేది.. కానీ బుధవారం నుంచి పెయిడ్ పార్కింగ్ మొదలు పెట్టారు. విచిత్రం ఏంటంటే మెట్రో టికెట్ ధర కన్నా పార్కింగ్ ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. సదుపాయం లేకపోయినప్పటికీ భారీ మొత్తం పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయడం ఎంత వరకు న్యాయం అని తప్పబడుతున్నారు. సామాన్యులు, చిరుద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో ప్రతిరోజూ మెట్రోలో సుమారుగా 4 నుంచి 5లక్షల మంది ప్రయాణిస్తుంటారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలు రాకపోతే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి దగ్గర నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరకు వెళ్లి వ్యక్తిగత వ్యాహనాల్లో వస్తున్నారు. అయితే తమ వాహనాలను మెట్రో పార్కింగ్ ఏరియాలో నిలిపి.. ఆఫీసులు, ఇతర పనులపై బయటకు వెళ్లిపోయేవారు. కొన్ని మెట్రో స్టేషన్లలో ఉచితంగా వాహనాలను పార్కింగ్ కి అనుమతి ఇస్తున్నారు. తాజాగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో.. నాగోల్ మెట్రోలో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ఎత్తివేసింది. ఇక్కడ ప్రిపెయిడ్ పార్కింగ్ బోర్డు దర్శనిమిస్తుంది. ఈ రోజు (ఆగస్టు 14) నుంచి పార్కింగ్ చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. 2 గంటలకు రూ.10, అదే 8 గంటలకు రూ.25 చెల్లించాలి. 12 గంటలకు బైకులను పార్క్ చేయాంటే రూ.40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఇలా పార్కింగ్ చార్జీలు బాదితే మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

Show comments