Dharani
Hyderabad Irani Chai Price Increased: చాయ్ లవర్స్‌కి ఇది చాలా బ్యాడ్ న్యూస్. మరీ ముఖ్యంగా బయట టీ తాగే వారికి షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎందుకంటే చాయ్ ధర భారీగా పెరిగింది. ఆ వివరాలు..
Hyderabad Irani Chai Price Increased: చాయ్ లవర్స్‌కి ఇది చాలా బ్యాడ్ న్యూస్. మరీ ముఖ్యంగా బయట టీ తాగే వారికి షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎందుకంటే చాయ్ ధర భారీగా పెరిగింది. ఆ వివరాలు..
Dharani
చాయ్, టీ, తేనీరు.. పేరు ఏదైనా గానీ.. ఆ ద్రావణంతో మన జీవితాలు పెనవేసుకుపోయాయి. పొద్దున లేవగానే.. వేడి వేడి టీ గొంతు దిగకపోతే.. చాలా మందికి రోజు ప్రారంభం కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రోజులో కనీసం 5-6 సార్లైనా చాయ్ తాగే వాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఇక ఇంటికి బంధువులు, స్నేహితులు ఎవరు వచ్చినా సరే.. టీ కచ్చితంగా ఇస్తారు. ఒక్క పూట అన్నం లేకపోయినా పర్లేదు కానీ.. చాయ్ లేకపోతే ఉండలేం అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఉద్యోగులు సైతం రిలాక్సేషన్ కోసం.. మధ్యలో బయటకు వచ్చి.. చాయ్ తాగుతారు. ఇక మన దగ్గర అత్యంత లాభదాయకమైన బిజినెస్ అంటే చాయ్ బండి అని చెప్పవచ్చు. కాస్త టేస్టీగా ఉంటే చాలు.. కస్టమర్లు వద్దాన్నా వస్తారు.
ఇంతలా టీ అనేది మన జీవితాల్లో పెనవేసుకుపోయింది. మరి మీరు కూడా టీ లవర్స్ అయితే.. మీకోక బ్యాడ్ న్యూస్.. అదేంటి అంటే.. నగరంలో చాయ్ ధరలు భారీగా పెరిగాయి. నార్మల్ చాయ్, ఇరానీ చాయ్ రేట్లను అమాంతం పెంచేశారు వ్యాపారులు. మరి ఇంత సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. టీ ధర ఎంత పెరిగింది వంటి వివరాలు మీ కోసం..
నగరంలో చాయ్ ధరలు భారీగా పెరిగాయి. టీ రేటు ఒకేసారి రూ.5 పెంచుతూ వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాలు, టీ పొడి, చక్కెర, ఇతర ఛార్జీలు అన్ని పెరిగాయని.. అందుకే తాము కూడా చాయ్ రేటు పెంచామని వ్యాపారులు అంటున్నారు. ఇక హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్‌కు చాలా ఫేమస్. దేశంలో ఎక్కడా దొరకనంత రుచికరమైన ఇరానీ చాయ్.. మన భాగ్యనగరంలో లభిస్తుంది. ధరల పెంపు నేపథ్యంలో ఇకపై అంత రుచికరమైన ఇరానీ చాయ్ తాగాలంటే.. కచ్చితంగా 25 రూపాయలు చెల్లించాల్సిందే. భారీగా పెరిగిన ధరలపై చాయ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ పాలు, టీపొడి, చక్కెర వంటి పదార్థాల ధరలు పెరగడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వ్యాపారులు అంటున్నారు.