నెల క్రితమే పెళ్లి.. ఆ భయంతో నవ వరుడు ఆత్మహత్య..!

ఆ కుర్రాడికి నెల రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. ఆ జంటను చూసి చిలకా గోరింకల్లా ఉన్నారని అనుకున్నారంతా.. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన కుర్రాడు.. కారు పార్కు చేసి..

ఆ కుర్రాడికి నెల రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. ఆ జంటను చూసి చిలకా గోరింకల్లా ఉన్నారని అనుకున్నారంతా.. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన కుర్రాడు.. కారు పార్కు చేసి..

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన, అద్బుతమైన ఘట్టం. వివాహం అనగానే పెళ్లి కూతురికి ఎంత హడావుడి ఉంటుందో.. పెళ్లి కొడుకు ఇంట కూడా అంతే హంగామా ఉంటుంది. పెళ్లిపై వధువుకు ఎన్ని అంచనాలు ఉంటాయో.. వరుడికి కూడా నానా రకలా ఆలోచనలు తిరుగుతుంటాయి. వచ్చిన అమ్మాయి తనను, తన తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని, తన మాటలకు విలువ ఇవ్వాలని, తనకు ఎదురు చెప్పకూడదనని భావిస్తుంటాడు. అతడు కోరుకున్న భార్య దొరికితే.. ఇక ఆ సంసారం నిండు నూరేళ్లు పచ్చగా సాగిపోతుంది. ఇలాంటి ఆశలతోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువకుడు.. నెల తిరక్కుండానే విగత జీవిగా మారాడు.

పెళ్లి అయ్యి నెల రోజులు కాకుండానే నవ వరుడు రితీష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రితీష్ రెడ్డి అనే యువకుడికి గత నెలలో పెళ్లి అయ్యింది. కానీ మంగళవారం.. ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బిల్డింగ్ ముందు కారు పార్కింగ్ చేసి, అదే భవనం పైకి ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. భవనం పై నుండి దూకేయడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే విచారణలో మరో విషయం తేలింది. రితీష్ రెడ్డి ఇటీవల ఓ ప్రమాదం చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి మరణించడంతో.. తన వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయన్న ఆవేదనతో రితీష్ ఉన్నట్లు చెబుతున్నారు.

తన వల్ల ఓ వ్యక్తి మరణించడం, పోలీసు కేసు, కొత్తగా పెళ్లి కావడం అన్ని అతడిలో భయాన్ని, ఆత్మనూన్యత భావాన్ని పురిగొల్పాయి. దీంతో ఏం చేయాలో తోచక.. కారుతో బయటకు వెళ్లిన వ్యక్తి.. భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న యువకుడు.. ఇప్పుడు విగత జీవిగా మారే సరికి వధువుతో పాటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు కూడా విషాదంలో మునిగిపోయారు.

Show comments