Hyderabad వాసులకు అలర్ట్‌.. నేడు నగరంలో కరెంట్‌ కోతలు.. ఎక్కడెక్కడంటే

Power Cut Schedule: నగరవాసులకు విద్యుత్‌ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. నేడు నగరంలో పలు చోట్ల కరెంట్‌ కోతలు ఉండనున్నాయి అని తెలిపారు. ఆ వివరాలు..

Power Cut Schedule: నగరవాసులకు విద్యుత్‌ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. నేడు నగరంలో పలు చోట్ల కరెంట్‌ కోతలు ఉండనున్నాయి అని తెలిపారు. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా మే నెల ముగింపులో ఎండలు మండి పోవాలి. కానీ ఈ సారి మాత్రం తుపాను, ఉపరితల ద్రోణి కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. దాంతో ఈ నాలుగైదు రోజుల నుంచి.. రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే ఇది రెండు రోజుల మురిపమే. నేడు, రేపు ఈ రెండు రోజులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని.. కొన్ని ఏరియాల్లో వర్షం కురుస్తుందని జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల బారి నుంచి తప్పించుకోవడం కోసం జనాలు నిత్యం కూలర్‌, ఏసీలు నడిపిస్తూనే ఉన్నారు. మరి ఎండలు మండుతాయి అని తెలిపిన నేపథ్యంలో.. నగరవాసులకు విద్యుత్‌ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు అనగా మే 28, మంగళవారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోతలు ఉండనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోతలు ఉంటాయి అని తెలిపారు. అంతేకాక పవర్‌ కట్స్‌కి గల కారణాలను కూడా ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల చాలా ప్రాంతాల్లో గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్​కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

ఈనేపథ్యంలో పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్‌లో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు ఇవాళ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని, విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయిస్తామని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాక నేడు ఒక్క రోజు మాత్రమే ఈ కరెంట్‌ కోతలు ఉంటాయన్నారు. ఒక్కో ఫీడర్ ఏరియాలో ఎన్ని గంటలు పవర్ కట్ ఉంటుందనేది దాని గురించి అధికారులు తెలిపారు. ఆ వివరాలు..

ప్రాంతాల వారీగా షెడ్యూల్:

ఉదయం 10:30-12:00 వరకు: 11కేవీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫీడర్. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏరియా, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏరియా, సుజాత స్కూల్ ఏరియా, మెడ్విన్ హాస్పిటల్ ఏరియా, చాపల్ రోడ్ ఏరియాలోని విజయా బ్యాంక్, మహేష్ నగర్ ప్రాంతంలో పవర్‌ కట్స్‌ ఉండనున్నాయి.

మధ్యాహ్నం 12:30-2:00 వరకు: 11కేవీ బాబుఖాన్ ఎస్టేట్ ఫీడర్ ఈ ఏరియాలో బాబూఖాన్ ఎస్టేట్ ప్రాంతం, ఎల్‌బీ స్టేడియం రోడ్డు, హెచ్‌పీ పెట్రోల్ బంకు ప్రాంతం, కమిషనర్ కార్యాలయం, నిజాం హాస్టల్ ప్రాంతం, ఎల్‌బీ స్టేడియం, జగదాంబ జ్యువెలర్స్ భవనం.

మధ్యాహ్నం 3:00-4:30 గంటల వరకు: 11కేవీ ఏపీ టూరిజం ఫీడర్. ఈ ఏరియాలో అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రాంతం, లిబర్టీ పెట్రోల్ పంప్ ప్రాంతం, ఆయిల్ సీడ్స్ క్వార్టర్స్ ప్రాంతం, స్టాంజా భవనం ప్రాంతం, దాదుస్ స్వీట్ షాప్ ప్రాంతాల్లో పవర్‌ కట్స్‌ ఉంటాయని వెల్లడించారు.

Show comments