Holidays: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. వరుసగా 5 రోజులు సెలవులు

Holidays-In Aug 3rd Week: విద్యార్థులు, ఉద్యోగులకు ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ఆగస్టు మూడో వారంలో వారికి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు..

Holidays-In Aug 3rd Week: విద్యార్థులు, ఉద్యోగులకు ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ఆగస్టు మూడో వారంలో వారికి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు..

శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ నెల నుంచి పండగలు మొదలు కావడమే కాక.. ఇన్నాళ్లు బ్రేక్‌ పడ్డ శుభకార్యాలు కూడా తిరిగి మొదలవుతాయి. వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ఆగస్టులో విద్యార్థులు, ఉద్యోగస్తులకు సెలవులు భారీగా వస్తాయి. కొన్ని సార్లు ఇవి వరుసగా వస్తుంటాయి. దాంతో ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్లడం, లాంగ్‌ ట్రిప్‌ వంటివి ప్లాన్‌ చేసుకోవడం చేస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు మూడో వారంలో వరుసగా 5 రోజులు హాలీడేస్‌ వస్తున్నాయి. దాంతో వారు ఫుల్లు ఖుషీగా ఉన్నారు. ఇంతకు ఏ తేదీల్లో ఈ సెలవులు రాబోతున్నాయి.. ఆ రోజు ఉన్న పండుగలు, ప్రత్యేకతలు ఏంటంటే..

ఆగస్టు మూడో వారంలో అనగా 12-19 వరకు వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఆ రోజు అనగా గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు. ఆ మరసటి రోజే అనగా ఆగస్టు 16, శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది. ఇది ఆప్షనల్‌ హాలీడే. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే.. ఆరోజున చాలా మంది మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు సెలవు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆగస్టు 17 శనివారం నాడు కొన్ని స్కూళ్లకు హాలీడే, హాఫ్‌ డే ఉంటుంది. ఇక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకైతే సెలవు పక్కా.

ఆ తర్వాత అనగా ఆగస్టు 18, ఆదివారం అందరికి సెలవు. వెంటనే 19, సోమవారం నాడు రాఖీ పండుగ. చాలా వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు. ప్రైవేటు యాజమాన్యాలకు ఆప్షనల్‌ హాలీడే. ఇలా మొత్తంగా చూసుకుంటే.. ఆగస్టు మూడో వారంలో వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 17 శనివారం ఒక్క రోజు కేవలం సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌కు మాత్రమే సెలవు. దాంతో ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే.. వరుసగా 5 రోజుల పాటు హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. సో ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్లానుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు.

సెలవులు అన్ని విద్యాసంస్థలు, కంపెనీలకు ఒకేలా ఉండవు. యాజమాన్యాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి అనే విషయం గుర్తించాలి. సెలవుల జాబితా ఇదే..

  • ఆగస్టు 15- స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16- వరలక్ష్మీ వ్రతం
  • ఆగస్టు 17- సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌కు హాలీడే (శనివారం)
  • ఆగస్టు 18- ఆదివారం
  • ఆగస్టు 19- రక్షా బంధన్‌

Show comments