P Venkatesh
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కఠిన నిర్ణయం తీసుకుంది. మంచి జీవితం ఉన్నప్పటికీ ఆ సమస్య వల్ల దారుణానికి ఒడిగట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కఠిన నిర్ణయం తీసుకుంది. మంచి జీవితం ఉన్నప్పటికీ ఆ సమస్య వల్ల దారుణానికి ఒడిగట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
P Venkatesh
ఇటీవలికాలంలో చిన్న చిన్న కారణాలతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో ఏ మాత్రం ఆలోచించకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. పరిష్కరించుకుంటే సమసిపోయే సమస్యలకు భయపడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. చిన్న సమస్యలను కూడా పెద్దవిగా ఊహించుకుని తనువు చాలిస్తున్నారు. వారి నిర్ణయాలు కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ టీచర్ ఓ సమస్య కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. మంచి జీవితం ఉన్నా కూడా ఆ సమస్య నుంచి భయటపడలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35 ) అనే మహిళ ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నది. ఆమె జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. కాగా సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్ తో 2015 లో వీణ వివాహం జరిగింది. అయితే కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు తలెత్తాయి. ఈ కారణంతో గతకొంతకాలంగా భార్యాభర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మానసిక వేధనకు గురైంది వీణ.
ఈ క్రమంలో వీణ పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బీబీపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.