భార్య ఇన్ స్టాగ్రామ్‌ని భర్త వాడకూడదు అనడం క్రూరత్వమే: TG హైకోర్టు

భర్త/భార్యకు సంబంధించిన కేసుల్లో కోర్టుల్లో భిన్నమైన తీర్పులు వస్తున్నాయి. తాాాజాగా తెలంగాణ హైకోర్టు కూడా విభిన్నమైన తీర్పునిచ్చింది. భార్యా భర్తల సోషల్ మీడియా ఖాతాలను మరొకరు వినియోగించడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

భర్త/భార్యకు సంబంధించిన కేసుల్లో కోర్టుల్లో భిన్నమైన తీర్పులు వస్తున్నాయి. తాాాజాగా తెలంగాణ హైకోర్టు కూడా విభిన్నమైన తీర్పునిచ్చింది. భార్యా భర్తల సోషల్ మీడియా ఖాతాలను మరొకరు వినియోగించడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్య కాలంలో న్యాయ స్థానాలు సరికొత్త తీర్పులను ఇస్తున్నాయి. భార్యా భర్తలకు సంబంధించిన కేసుల్లో కూడా విభిన్నమైన తీర్పులను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. భార్య సంపాదనపై భర్తకు హక్కులేదని ఇటీవల సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది.  భార్యాభర్తల సోషల్ మీడియా ఖాతాలను మరొకరు వినియోగించవద్దని చెప్పడం క్రూరత్వం కిందకు వస్తుందని పేర్కొంది. ఓ కేసులో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ ధర్మాసనం. హిందూ వివాహ చట్టం కింద విడాకులు కోరుతూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. ఈ కేసు వివరాలోకి వెళితే..

2010లో హిందూ వివాహ చట్టం ప్రకారం..పెళ్లి చేసుందో జంట. పెళ్లైన నాలుగు రోజుల నుండే అంటే డిసెంబర్ 4 నుండే అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. అంతలో 2011లో వీరికి ఓ బిడ్డ జన్మించింది. అదే ఏడాది నవంబర్ నుండి ఇద్దరు విడిగా జీవిస్తున్నారు. 2012.. జులై 11న భర్త, అతడి కుటుంబం హింసిస్తున్నారని చెప్పడంతో అరెస్టు కాగా, ఆగస్టులో బెయిల్ వచ్చింది. అయితే భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. 2012లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేసు కొనసాగలేదు. భార్య IPC సెక్షన్ 498-A కింద ఆరోపణలతో సహా భర్తపై ఐదు క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. అయితే వీరి మధ్య కొంతమంది కుటుంబ పెద్దలు రాజీ చేయడంతో మే 2015 నుంచి కొంతకాలం కలిసి జీవించారు. తరువాత కూడా భార్య మళ్లీ భర్తపై కేసులు పెట్టడం ప్రారంభించింది.

దీంతో 2021లో విడాకుల కోసం భర్త వేసిన పిటిషన్ వేయగా.. కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిపై వాదనలు చేపట్టింది కోర్టు. తన భర్త తన సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తాడని భార్య ఆరోపణలు చేసింది. అలాగే భార్య పదే పదే క్రిమినల్ కేసులుపెట్టడం, శారీరకంగా,మానసికంగా హింసకు గురి అయ్యానని భర్త తన వాదనలు వినిపించాడు. 2011లో విడిపోయి.. 2015లో మళ్లీ కొంత కాలం కలిసినట్లు ఉన్నప్పటికీ.. ఆమెలో ఏ మార్పు రాలేదని వెల్లడించాడు. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు.. వీరి వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్చిన్నమైందని పేర్కొంది. భార్యా భర్తల్లో సోషల్ మీడియా ఖాతాలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ను మరొకరు వాడొద్దనడం క్రూరత్వం లాంటిదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయ పడింది. ఇక వీరి వివాహ బంధాన్ని మళ్లీ బలోపేతం చేయడం కష్టమని, ఈ బంధం రాజీపడి కలిసి జీవించాలని బలవంతం చేయదంటూ విడాకులు మంజూరు చేసింది.

Show comments