Revanth Reddy: తెలంగాణలో రైతుల కోసం కొత్త కార్యక్రమం.. వారికి ఉచితంగా

TG New Scheme For Formers: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు. వారి కోసం మరో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ వివరాలు..

TG New Scheme For Formers: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు. వారి కోసం మరో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అన్నదాతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల్లో అతి ముఖ్యమైన 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీని అమలు చేసి.. వారి కళ్లల్లో ఆనందం నింపారు. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కరువు, వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టం సాయం అందిస్తున్నారు. అలానే వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నారు. వీటితో పాటుగా పంటకు మద్దతు ధర ఇచ్చి ప్రోత్సాహిస్తున్నారు.  ఈక్రమంలో తాాాజాగా రేవంత్ సర్కార్.. అన్నదాతల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వారికి ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. సోలార్ పంపు సెట్ల ద్వారా భవిష్యత్తులో రైతులకు విద్యుత్ ఇబ్బంది తలెత్తదని.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు.

అంతేకాక తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలసి సీఎం తన నివాసంలో విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి పలు సూచనలు జారీ చేశారు.

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని.. అలానే వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. అంతేకాక రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలానే వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందుకు మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని.. ప్రతీ ఏటా 40 వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు తెలిపారు
Show comments