సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్తను అందించారు. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్తను అందించారు. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

ఖమ్మంలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నిలువ నీడ లేక వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టడంతో భారీగా వరదలు సంభవించాయి. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఖమ్మంలో వరదలు రావడం బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సాయం ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. వరదల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండంతో భారీగా వరదలు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరంగల్-విజయవాడ రూట్లో రైల్వే ట్రాక్స్ సైతం దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యల్లో అధికారులు బిజీ అయిపోయారు. మరో వైపు వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష చేసిన తెలంగాణ సీఎం వరదల కారణంగా ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని భారీగా పెంచారు. ఇదివరకు రూ. 4 లక్షలు ఇస్తుండగా తాజాగా దాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Show comments