P Krishna
Telangana Government: తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Telangana Government: తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాదు.. ఇతర అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు తగు పరిహారం కూడా చెల్లించారు. తాజాగా అన్నదాతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణ రైతుకుల మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులకు వచ్చే నెల నుంచి విడతల వారీగా రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. రెండు లక్షల లోపు పంట రుణాలున్న రైతులు ఇంకా నాలుగు లక్షల మందివరకు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు అంటున్నారు. వీరందరికీ దీపావళి పండుగ లోపే సాయం అందజేసేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తుమ్మల అన్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో రైతు భరోసా సాయాన్ని రూ.15వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండు విడతల్లో రూ.7500 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించనుంది. ఇది కూడా త్వరలో అమలు చేస్తామని తుమ్ముల తెలిపారు. ఈ నెలాఖరు నాటికి రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులు కూడా విడుదల అవుతాయని.. దీపావళికి రెండు కానుకలు అందినట్లు అవుతుందని మంత్రి తుమ్మల అన్నారు. అలాగా వరి పంట వేసే రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ కూడా అందిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు.