డోనాల్డ్ ట్రంప్‌కి గుడి.. ఎక్కడ ఉందో తెలుసా?

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ మెజారిటీ మార్క్‌ను అందుకుని తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ మెజారిటీ మార్క్‌ను అందుకుని తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు

ఎంతో ఉత్కంఠంగా సాగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ మెజారిటీ మార్క్‌ను అందుకుని తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి తెలంగాణలో ఒక గుడి ఉన్న సంగతి మీకు తెలుసా? జనగామ జిల్లాలోని బచ్చన్న పేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సు రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ.. డొనాల్డ్ ట్రంప్ కి వీరాభిమాని. 2019లో ‘మీరు అంటే నా ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దానికి డోనాల్డ్ ట్రంప్ ‘ఓకే’ తప్పకుండా కలుద్దాం అని రీ ట్వీట్ చేయడంతో కృష్ణ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

2020 లో ఫిబ్రవరి లో ట్రంప్ కి తన ఇంటి వద్ద గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు, ఉపవాస దీక్షలు చేసేవాడు. ఎప్పటికప్పుడు ట్రంప్ విగ్రహాన్ని శుభ్రంగా ఉంచేవారు. ట్రంప్ పుట్టిన రోజు వస్తే ఊరంగా స్వీట్లు పంచుతూ సంబరాలు చేసేవాడు. కరోనా మహమ్మారి సమయంలో ట్రంప్ కి కరోనా సోకితే ఆయన క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించాడు.తాను ఎంతగానో అభిమానించే ట్రంప్ రెండోసారి ఎన్నికల్లో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణ 2020 అక్టోబర్ 11న గుండెపోటుతో కన్నుమూశాడు. కృష్ణ భార్య కూడా ట్రంప్ అంటే ఎంతో అభిమానించేది. కృష్ణ చనిపోవడానికి ముందే మగబిడ్డను ప్రసవిస్తూ మరణించింది. వారి కుమారుడు ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించడంతో ఆయన విగ్రహం తెరమీదకు వచ్చింది. పలువురు గ్రామస్థులు ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు.ట్రంప్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు పంచుకున్నారు.

ట్రంప్ మరోసారి విజయం సాధించాడన్న విషయం విని సంతోషించానికి ఆయన అభిమాని కృష్ణ దంపతులు లేరు. ఈ సందర్బంగా కృష్ణ స్నేహితులు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కి కృష్ణ డైహార్ట్ ఫ్యాన్. ఏకంగా ఆయనకు గుడి కట్టించి పూజలు చేశాడు. సాధారణంగా ఎవరైనా సినిమా హీరో హీరోయిన్లు, రాజకీయ నేతలు, క్రికెట్ క్రీడాకారులు అంటే ఇష్టపడతారు. కానీ కృష్ణకు మాత్రం డొనాల్డ్ ట్రంప్ అంటే వల్లమాలిని అభిమానం అన్నారు. తన ఇంటి నిండా ట్రంప్ కి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు, గొడలపై ట్రంప్ ను కీర్తిస్తూ గ్రాఫిటీ రాశారు. నిత్యం ట్రంప్ టీషర్ట్స్, షర్ట్స్ ధరించేవాడు. తాను చచ్చేలోపు ఒక్కసారైనా ట్రంప్‌ను కలవాలని ప్రయత్నించాడు. కానీ.. ఆ ఆశ తీరకుండానే చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో డొనాల్డ్ ట్రంప్ కి గుడి అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో మల్లీ తెరపైకి వచ్చి వైరల్ అవుతుంది.

Show comments