CS Somesh Kumar: భారీ కుంభకోణం.. రూ.1000 కోట్ల స్కామ్‌లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌పై కేసు

Case On Former CS Somesh Kumar In Rs 1000 Cr GST Scam: తెలంగాణలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ మీద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

Case On Former CS Somesh Kumar In Rs 1000 Cr GST Scam: తెలంగాణలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ మీద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఓ వైపు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూనే.. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, స్కామ్‌లను, బయటకు లాగుతుంది. ఇప్పటికే గొర్రెల పంపకం వంటి పథకాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. 1000 కోట్ల రూపాయల భారీ కుంభకోణంలో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ మీద పోలీసులపై కేసు నమోదు చేశారు. ఇంతకు స్కామ్‌ ఏంటి.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చిక్కులోపడ్డారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఓ స్కాంలో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో దాదాపుగా రూ.వెయ్యి కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌తో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఐదో నిందితుడిగా సోమేష్ కుమార్ పేరును చేర్చడం తాజాగా రాష్ట్రంలో సంచలనంగా మారింది.

కేసు నమోదు చేసిన వారంతా.. టాక్స్ ఎగవేతదార్లకు సహకరించారని.. అందువల్ల భారీగా అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సోమేష్‌ కుమార్‌ సహా మిగతా వారిపై 406, 409, 120(బి) ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక్క తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్యపన్నుల శాఖకు సుమారుగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400 కోట్లు పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా తాము గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీప్‌ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎటువంటి పన్ను చెల్లించకుండా రూ.25.51 కోట్ల ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీతో పాటు ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ మౌఖిక ఆదేశాలతోనే వాణిజ్య పన్నుల శాఖకు సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తేలింది. ఈ స్కాంలో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించి.. ఆయనని ఐదో నిందితుడిగా చేర్చారు. అయితే పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Show comments