Dharani
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మీద బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మీద బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
Dharani
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వ్యవస్థలని మానేజ్ చేస్తూ.. జైలుకి వెళ్లకుండా నెట్టుకొచ్చారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అది చంద్రబాబు విషయంలో నిజమయ్యింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబుని అరెస్ట్ చేసింది. దాంతో ఆయన సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక మూడు రోజుల క్రితమే ఏపీ హైకోర్టు.. చంద్రబాబుకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. ఆయన మీద బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు.. బుధవారం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. రెండు గంటల పాటు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో అనుమతుల్లేకుండా చంద్రబాబు ర్యాలీ చేయడంతో ఆయనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది. చంద్రబాబు మీద ఐపీసీ సెక్షన్ 341, 290,21 రెడ్ విత్ 76 సీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
సుమారు రెండు గంటల పాటు.. రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని.. బాబుపై కేసు నమోదయ్యింది. హైదరాబాద్ సీటీ టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400 మంది ఈర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇక ఇదే కాక.. ఏపీ పైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు మెయిన్ బెయిల్ పిటిషన్‌పై ఇంకా విచారణ జరగలేదు.
ముసలోడు పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు
చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
నిన్న హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు
అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో బాబుపై కేసు నమోదు pic.twitter.com/0fz9cb7d7k
— Rahul (@2024YCP) November 2, 2023