వీడియో: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులపై దాడి

వీకెండ్, పండుగ, పబ్బాలతో సంబంధం లేకుండా మద్యం సేవిస్తుంటారు మద్యం ప్రియులు. ఆనంద, విషాదాలకూ తీర్థం తీసుకోవాల్సిందే. ఇక న్యూ ఇయర్ వేడుకలు వస్తే.. కచ్చితంగా అందులో తడిసి ముద్దవుతూ చిల్ అవ్వాలసిందే. ఆ తర్వాత రచ్చ చేయాల్సిందే.

వీకెండ్, పండుగ, పబ్బాలతో సంబంధం లేకుండా మద్యం సేవిస్తుంటారు మద్యం ప్రియులు. ఆనంద, విషాదాలకూ తీర్థం తీసుకోవాల్సిందే. ఇక న్యూ ఇయర్ వేడుకలు వస్తే.. కచ్చితంగా అందులో తడిసి ముద్దవుతూ చిల్ అవ్వాలసిందే. ఆ తర్వాత రచ్చ చేయాల్సిందే.

’కమ్మని కలలకు ఆహ్వానం.. చక్కని చెలిమికి శ్రీకారం.. హ్యాపీ న్యూఇయర్‘ అంటూ యువతులు, మహిళలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. ‘మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం’ అంటూ మునిగి తేలిపోయారు పురుష పుంగవులు. మామాలుగానే..పండుగ, పబ్బాలతో పనిలేకుండా తీర్థం తీసుకునే మద్యం ప్రియులకు.. ఇక నూతన ఏడాది వస్తుందంటే చాలు.. బారు షాపులు యాజమానులు బంద్ చేసేంత వరకు తాగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 తాగి.. డ్రైవ్ చేస్తే జరిమానా విధించినట్లు తెలిపింది.

అయినా ఆగుతారా.. అసలే రాబోతున్నది కొత్త ఏడాది.. గొంతులో పెగ్ అయినా పడాల్సిందే. పెగ్ దగ్గర రాజీ పడి.. మితిమీరి తాగే మహానుభావులున్నారు. ఇక ఇంటికి వెళ్లే సమయంలో జోగుతూ, తూలుతూ బండి నడిపి జీవితాలను ప్రమాదంలో పడేస్తుంటారు. డ్రంక్ డ్రైవ్‌లో అడ్డంగా పోలీసులకు దొరికిపోతున్నారు. ఈ ఏడాది కూడా భారీగానే బాటిల్స్ ఖాళీ చేశారట మందుబాబులు. ఇక నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ. 15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం. అయినా బేఖాతరు చేసిన మద్యం ప్రియులు.. డ్రింక్ చేసి వాహనాన్ని తోలుతూ ఖాకీలను పట్టుబడ్డారు.

పాత బస్తీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ అనే వ్యక్తి వావానాన్ని ఆపారు. అతడిని చెక్ చేస్తుండగా.. పోలీసులపైకే దాడికి దిగాడు. బండి ఎందుకు ఆపావు నీ అయ్య జాగిరా అంటూ పోలీసులపై చేయి చేసుకున్నాడు మహేంద్ర సింగ్. మరో వ్యక్తి ఫుల్ గా తాగి.. ఖాకీలకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత వారి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ పట్టేసుకున్నారు పోలీసులు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఒక్క హైదరాబాద్ పరిధిలోడిసెంబర్ 31న రాత్రి.. 3000 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయంటే.. ఎంతలా తాగారో అర్థం చేసుకోవచ్చు. మరలా ఈ ఫెస్టివల్ రాదు అన్నట్లు తాగిన మందు బాబులను ఏమనాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments