AE caught by ACB taking bribe: MPDO ఆఫీస్లో ఏసీబీ సోదాలు.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన AE

MPDO ఆఫీస్లో ఏసీబీ సోదాలు.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన AE

రాష్ట్రంలో లంచం తీసుకునే అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు లంచం తీసుకుంటున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో ఈ వ్యవహారం చర్చకు దారితీస్తోంది. ఇటీవల మర్రిగూడ ఎంఆర్ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీకి అక్కడ దొరికిన నగదు చూసి షాక్ అయ్యింది. ట్రంకు పెట్టెల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. దీంతో ఆ అవినీతి అధికారిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏసీబీ సోదాలు నిర్వహించగా మరో లంచగొండి అధికారి పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని ఆలేరులో ఎంపీడీఓ ఆఫీస్ లో పంచాయతీ రాజ్ అధికారి ఏఈ రమేష్ పనిచేస్తున్నాడు. ఆయన శారాజిపేట గ్రామంలో సీసీ రోడ్డు కాంట్రాక్టర్ శ్రీశైలం నుంచి లంచం డిమాండ్ చేశాడు. శారాజిపేట గ్రామంలో 16 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు సంబంధించి ఎంబి రికార్డు చేయకుండా కాంట్రాక్టర్ ను ఏఈ రమేష్ తిప్పుకుంటున్నాడు. లంచం ఇస్తేనే ఎంబీ రికార్డుల్లో చేరుస్తానని తెగేసి చెప్పాడు. దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఈ నెల 5న ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు. ఆ రోజు నుంచి ఏఈ రమేష్ పై అధికారులు నిఘా పెట్టారు. ఈ రోజు (అక్టోబర్07 2023) కాంట్రాక్టర్ నుంచి ఏఈ రమేష్ రూ. 80వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

Show comments