P Venkatesh
తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నూతన గవర్నర్ గా సి.పి.రాధాకృష్ణన్‌ను నియమించారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నూతన గవర్నర్ గా సి.పి.రాధాకృష్ణన్‌ను నియమించారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
P Venkatesh
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నిన్న(మార్చి18) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలి మహిళా గవర్నర్ గా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఇక తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించారు. ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్ గా నియమించారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించేంత వరకు ఆయన అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. గత కొంత కాలంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళిసై రాజీనామా ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ pic.twitter.com/RoTJfBT3Gn
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2024