Unix బ్రాండ్ నుంచి తక్కువ ధరలో నెక్ బ్యాండ్! ఫీచర్స్ అదిరాయి!

Unix Bombshell TWS Neckband: యూనిక్స్ కంపెనీ తక్కువ ధరలతో తన ఉత్పత్తులను అందిస్తూ ఇండియాలో పాపులర్ బ్రాండ్ గా కొనసాగుతుంది.

Unix Bombshell TWS Neckband: యూనిక్స్ కంపెనీ తక్కువ ధరలతో తన ఉత్పత్తులను అందిస్తూ ఇండియాలో పాపులర్ బ్రాండ్ గా కొనసాగుతుంది.

ఫేమస్ ఇండియన్ బ్రాండ్ Unix India గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినియోగదారులకు అందుబాటు ధరలో ప్రొడక్ట్స్ ని అందిస్తూ మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ బ్రాండ్ నుండి అందుబాటు ధరలోనే కొత్త నెక్ బ్యాండ్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ నెక్ బ్యాండ్ లో చాలా మంచి ఫీచర్లు వున్నాయి. ఆ ఫీచర్లు కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. దీనిని ఫాస్ట్ ఛార్జ్, ఎక్కువ ప్లే టైమ్ ఇంకా అలాగే పవర్ ఫుల్ సౌండ్ వంటి వివరాలతో కంప్లీట్ ప్యాకేజ్ గా అందించినట్లు యూనిక్స్ ఇండియా కంపెనీ తెలిపింది. ఇక మన ఇండియన్ బ్రాండ్ తక్కువ ధరలో సరికొత్త ఫీచర్లతో అందించిన ఈ కొత్త నెక్ బ్యాండ్ ఎలా ఉంది? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యునిక్స్ కంపెనీ యొక్క ఈ కొత్త నెక్ బ్యాండ్ పేరు Bombshell TWS Neckband. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది. అందువల్ల ఇది ఏకంగా 42 గంటల ప్లే టైమ్ ని అందిస్తుంది. ఈ కొత్త నెక్ బ్యాండ్ క్విక్ ఛార్జ్ మరియు ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీలని కలిగి ఉంది. అందువల్ల చాలా త్వరగా ఛార్జ్ అయ్యి ఎక్కువ ప్లే టైంని కూడా అందిస్తుందని యునిక్స్ కంపెనీ చెబుతోంది. ఇందులో ఉండే ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే.. ఈ నెక్ బ్యాండ్ సౌండ్ ఐసోలేషన్ నోయిస్ కంట్రోల్ తో వస్తుంది. దీని కలర్స్ విషయానికి వస్తే.. ఇది బ్లాక్, బ్లూ, గ్రీన్ ఇంకా అలాగే రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ అడ్వాన్డ్స్ స్పీకర్స్ తో క్రిస్టల్ క్లియర్ ఆడియో మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ ని అందిస్తుంది.

ఈ యునిక్స్ నెక్ బ్యాండ్ స్వెట్ ప్రూఫ్, కంఫర్టబుల్ ఫిట్, డ్యూయల్ నెక్ బ్యాండ్ కనెక్టివిటీ ఇంకా అలాగే బ్లూటూత్ 5.2 సపోర్ట్ తో వస్తుంది. అలాగే ఇది టైప్ C పోర్ట్ తో వస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఒక గంట సమయం పడుతుంది. దీన్ని హోల్డ్ చేయడానికి వీలుగా వెనుక మ్యాగ్నెట్ లనేవి ఉంటాయి. ఇది చాలా లైట్ గా కంఫర్ట్ గా ఉంటుందని కూడా యునిక్స్ పేర్కొంది. ఇక ధర విషయానికి వస్తే.. ఈ కొత్త నెక్ బ్యాండ్ ను కంపెనీ కేవలం రూ. 599 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెక్ బ్యాండ్ ని మనం అమెజాన్ మరియు కంపెనీ అధికారిక వెబ్సైట్ unixindia.in నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ సరికొత్త యునిక్స్ Bombshell TWS నెక్ బ్యాండ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments