Vinay Kola
Government Apps: ప్రభుత్వం ప్రజల పనులను సులభం చేసేందుకు కొన్ని మొబైల్ యాప్‌లను ప్రవేశ పెట్టింది. ఆ యాప్ లు ఏమిటి? వాటి వలన కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.
Government Apps: ప్రభుత్వం ప్రజల పనులను సులభం చేసేందుకు కొన్ని మొబైల్ యాప్‌లను ప్రవేశ పెట్టింది. ఆ యాప్ లు ఏమిటి? వాటి వలన కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.
Vinay Kola
ఒకప్పుడు మన పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అక్కడ మన పని అవ్వాలంటే కనీసం రెండు మూడు రోజులు సమయం పట్టేది. ఒక రెండు రోజులు తిరిగితే గానీ మన పనులు కావు. కానీ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. అంతా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ప్రతీదీ మన చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ నుండి పూర్తి చేయగల ఎన్నో సదుపాయాలు వచ్చాయి. మనకు ప్రభుత్వ సేవలు చాలా వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. ప్రభుత్వం ప్రజల పనులను మరింత సులభం చేసేందుకు కొన్ని మొబైల్ యాప్‌లను ప్రవేశ పెట్టింది. ఆ యాప్ లు ఫోన్లో ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇక ఆ యాప్ లు ఏమిటి? వాటి వలన కలిగే ఉపయోగాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
mAadhaar: ఈ యాప్ సహాయంతో ఆధార్ కి సంబంధించిన పనులను సులభంగా చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మీ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం, ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్, ఆధార్ వెరిఫై చేయడం ఇంకా ఇమెయిల్/మొబైల్ వెరిఫై చేయడం వంటి పనులకు సమయం పడుతుంది. ఈ పనులు కోసం మీరు ఆధార కేంద్రాలను సంప్రదించాలి. కానీ ఈ యాప్ సహాయంతో వీటిని ఫోన్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
mParivahan: మీరు కార్, బైక్ లేదా మరేదైన వాహనం వాడుతున్నట్లైతే ఈ యాప్ సహాయంతో మీ వాహనం గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వర్చువల్ ఆర్‌సీ, వర్చువల్ డీఎల్, ఆర్‌సీ, డీఎల్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే డూప్లికేట్ ఆర్‌సీ, యాజమాన్య బదిలీ, హైపోథెకేషన్ తొలగింపు, ఆర్టీఓ అపాయింట్మెంట్ ఇలా వాహనానికి సంబంధించిన మరెన్నో పనులను ఈ యాప్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
mPassport: ఈ యాప్ ద్వారా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పనులు సులభం అవుతాయి. పాస్ పోర్ట్ పనులను ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అంతేగాక ఈ యాప్ ద్వారా మీరు అపాయింట్‌మెంట్ కూడా బుకింగ్ చేయవచ్చు. పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
Digilocker: ఈ యాప్ లో మీరు మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ లను సేఫ్ గా ఉంచవచ్చు. ఈ యాప్‌లో మీరు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ మార్క్‌షీట్‌ల వంటి డాక్యుమెంట్ లని డిజిటల్ రూపంలో సెక్యూర్ గా స్టోర్ చేసుకోవచ్చు.
Umang: ఇక ఈ యాప్ విషయానికి వస్తే.. ఈ యాప్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సేవలను పొందవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, గ్యాస్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, రైలు టిక్కెట్ బుకింగ్ వంటి చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు.
ఇలా ఈ ప్రభుత్వ యాప్ లు మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మన పనులు సులభం అవుతాయి. ఇక ఈ యాప్ ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.