Tirupathi Rao
Realme C65 5G Price And Specifications: భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.10 వేలలోనే ఉండటం విశేషం. అంతేకాకుండా.. ఇందులో అదిరోపయే ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Realme C65 5G Price And Specifications: భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.10 వేలలోనే ఉండటం విశేషం. అంతేకాకుండా.. ఇందులో అదిరోపయే ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Tirupathi Rao
ఇప్పుడు మనకి తెలిసిన ఫోన్ బ్రాండ్స్ అన్నింటిలో దాదాపుగా లేటుగా వచ్చిన బ్రాండ్ రియల్మీ అని చెప్పొచ్చు. కాని ఇండియన్ ఇండస్ట్రీలో తన బ్రాండ్ కి అంటూ ఒక మార్క్ ని ఎప్పటికప్పుడు మైయిన్ టైన్ చేసుకుంటూనే వస్తోంది. అలాగే నెక్ బ్యాండ్ స్టైల్ లో హెడ్ సెట్ ని తయారు చెయ్యడం, నాయిస్ క్యాన్సిల్ ఫీచర్ ని చాలా తక్కువగా ఇవ్వడం ఇలా ఎన్నో మైల్ స్టోన్స్ రియల్మీ ఇండియా మార్కెట్ లో నిలదొక్కుకోవడానికి సహాయపడ్డాయి. ఇప్పుడు ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ తో ఆ స్థాయి మరింత సుస్థిరం చేసుకుంటోంది. మధ్యతరగతిని టార్గెట్ చేస్తూ.. కేవలం రూ.10 వేలకో 5జీ ఫోన్ తెచ్చేసింది.
ఇప్పుడు రియల్మీ తన 5G ఫోన్ అయిన C65ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది కేవలం రూ.10,499 లకే అందుబాటులో ఉంది. రీసెంట్ గా మళ్ళీ దీనిలో ఇంకో కలర్ ఉన్న మొబైల్ ని కూడా లాంఛ్ చేశారు. అంతక ముందు వేరింట్లు ఫేతర్ గ్రీన్ అలాగే గ్లోయింగ్ బ్లాకు కలర్స్ లో ఉండేవి. ఇప్పుడు స్పీడ్ రెడ్ కలర్ ని కూడా లాంఛ్ చేశారు. ఈ ఫోన్ జూన్ 14 నుంచి అందుబాటులోకి వచ్చింది. మాములుగా దీని ధర 11,499 రూపాయలు. కానీ రూ.1000 తగ్గించి 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ని రూ.10,499 కే ఇస్తున్నారు. అదే 4GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,499కే ఇస్తున్నారు. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ అయితే రూ.12,499కే అందుబాటులోకి తెస్తున్నారు. ఈ స్పీడీ రెడ్ వేరియంట్‌ను కూడా రూ.1000 రూపాయలు తగ్గించిన ధరకే అమ్ముతున్నారు.
రియల్ మీ C65 5G స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ HD+ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్, 89.97 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. అలాగే అట్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Mali G57 MC2 GPU తో జాయిన్ చేయబడింది. 6GB LPDDR4X ర్యామ్ అలాగే 128GB ఇంటర్నెల్ స్టోరేజీతో లభ్యమవుతుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్.చు అలాగే ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తుంది. 2 సంవత్సరాలపాటు OS, 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తుంది.
50MP కెమెరా, f/1.8 ఇంచెస్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రియల్‌మి ఫోన్ ను 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్ధ్యం తో వస్తుంది. రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 802.11, GPS, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. అలాగే సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు, IP54 రేటింగ్‌తో డస్ట్ అఆగే వాటర్ రెసిస్టెంట్‌గా కూడా వస్తుంది. ఏయిర్ గెశ్చర్ ఫీచర్ డైనమిక్ బటన్‌లను కలిగి ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చెయ్యకుండా బేసిక్ ప్రైస్ లో 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇప్పుడే ఈ రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేసుకోండి.