అందుబాటు ధరలో పోకో ప్యాడ్ 5జి! ఫీచర్స్ అదిరాయి!

Poco Pad 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన పోకో.. తాజాగా ప్యాడ్ 5జిని లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా ధర కూడా తక్కువే.

Poco Pad 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన పోకో.. తాజాగా ప్యాడ్ 5జిని లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా ధర కూడా తక్కువే.

ప్రముఖ టెక్ కంపెనీ పోకో తన స్మార్ట్ ఫోన్లతో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు అందించిన ఈ కంపెనీ తాజాగా ఇండియాలో ప్యాడ్ 5జిని లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాడ్ ని పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది మంచి స్క్రీన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ లో ఆకట్టుకునే ఫీచర్లు చాలా ఉన్నట్లు పోకో కంపెనీ వెల్లడించింది. పోకో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్యాడ్ ధర ఇంకా ఫీచర్ల గురించి పూర్తి వివరాల విషయానికి వస్తే.. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి.. 8GB ర్యామ్, 128GB ఇంటెర్నెల్ స్టోరేజ్ తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్ తో ఇంకా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ వేరియంట్ల ధరలు వేరుగా ఉంటాయి.

ఈ సరికొత్త పోకో ప్యాడ్ 5జి 12.1 ఇంచెస్ పెద్ద స్క్రీన్ తో వస్తుంది. ఇది చాలా క్లారిటీగా ఉంటుందట. ఈ స్క్రీన్ 2.5K పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ స్క్రీన్ కచ్చితంగా అద్భుతమైన విజువల్ ను అందిస్తుందట. ఈ పోకో ప్యాడ్ 5జి.. స్నాప్ డ్రాగన్ జెన్ 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ప్యాడ్ కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనుక 8 ఎంపీ సింగల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది సెటప్ ఫ్లాష్ లైట్ తో యాడయ్యి ఉంటుంది. అలాగే ఈ సరికొత్త ప్యాడ్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా వుంది. అందువల్ల వీడియో కాల్స్ క్లారిటీగా మాట్లాడుకోవచ్చు.

ఈ ప్యాడ్ స్పీకర్ విషయానికి వస్తే.. ఇది క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది చాలా పవర్ ఫుల్ సెటప్. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ ని కలిగి ఉంది. అందువల్ల యూజర్లకు సూపర్ సౌండ్ ని అందిస్తుంది. ఇక ఈ ప్యాడ్ బ్యాటరీ విషయానికి వస్తే.. చాలా పవర్ ఫుల్ బ్యాటరీని కంపెనీ అందించింది. ఈ ప్యాడ్ ఏకంగా 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. దీన్ని కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అంతేగాకా ఈ ప్యాడ్ పోకో స్మార్ట్ పెన్ ఇంకా పోకో కీబోర్డు సపోర్ట్ తో వస్తుంది. అంతేగాకా ఈ ప్యాడ్ లో హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ ఫీచర్ కూడా ఉన్నట్లు పోకో కంపెనీ తెలిపింది. దీని ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ ని రూ. 23,999 గా పేర్కొంది కంపెనీ. హై ఎండ్ వేరియంట్ ధరని రూ. 25,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ ను బ్యాంక్ ఆఫర్స్ ఇంకా ఇతర డిస్కౌంట్ ఆఫర్లతో కలిపి చాలా తక్కువ ధరకే పొందొచ్చు. ఈ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే పొందవచ్చని పోకో కంపెనీ తెలిపింది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ప్యాడ్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.

 

 

Show comments