Vinay Kola
Bank: హ్యాకర్లు పెరిగిపోతున్నారు. మీ డిజిటల్ సమాచారాన్ని దొంగిలించడం, మీ ప్రైవసీకి భంగం కలిగించడం వంటి స్కామ్‌లు చేస్తున్నారు.
Bank: హ్యాకర్లు పెరిగిపోతున్నారు. మీ డిజిటల్ సమాచారాన్ని దొంగిలించడం, మీ ప్రైవసీకి భంగం కలిగించడం వంటి స్కామ్‌లు చేస్తున్నారు.
Vinay Kola
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. బ్యాంకింగ్ పనులన్నీ కూడా ఆన్లైన్ లో ఈజీగా జరిగిపోతున్నాయి. నేరుగా బ్యాంకులకు వెళ్లి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని పూర్తిగా తగ్గిపోయింది. అంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే ఎంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా హ్యాకర్లు కూడా పెరిగిపోతున్నారు. ఆన్లైన్ లో మీ డిజిటల్ సమాచారాన్ని దొంగిలించడం, మీ ప్రైవసీకి భంగం కలిగించడం వంటి అనేక రకాల స్కామ్‌లు చేస్తున్నారు. దీనివల్ల మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బంతా మాయం అవుతుంది.
మనకు తెలియకుండానే మన సమాచారం ఆన్‌లైన్‌లో రికార్డ్ అవుతుందట. హ్యాకర్లు వీటన్నింటినీ చాలా ఈజీగా తెలుసుకుంటారు. చాలా మంది పేరు, చిరునామా, పుట్టిన ప్రదేశం వంటివి పాస్‌వర్డ్‌గా పెడుతూ ఉంటారు. అలాంటివి పెడితే కచ్చితంగా హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను ఈజీగా కనుగొంటారు. బ్యాంకింగ్ సేవలకు ఎప్పుడూ కూడా మీరు తప్ప ఎవరు కనుగొనలేని పాస్‌వర్డ్ సెట్ చేయాలి. 1,2,3,4,5 వంటి ఒకే నెంబర్లను ఉపయోగించవద్దు. మనకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఒక్కో బ్యాంకు ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. అంతేగాక కచ్చితంగా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌లను మార్చాలి. ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతాని ఎవ్వరూ హ్యాక్ చేయలేరు.
చాలా మంది కూడా ప్రయాణంలో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఫ్రీగా వైఫై వస్తుందని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఉపయోగిస్తే హ్యాకర్లు మీ బ్యాంకింగ్ సమాచారాన్ని ఈజీగా దొంగిలిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా బయట ప్రదేశాలలో వైఫైని ఉపయోగించవద్దు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో వెరీఫికేషన్స్ ఉంటాయి. అయితే ఫోన్ కాల్ ద్వారా మీ అకౌంట్ ని వెరిఫై చేసుకునే ఆప్షన్ ని సెట్ చేయండి. పేమెంట్స్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా ఫేస్ రికగ్నేషన్ ఆప్షన్ ని ఉపయోగించండి. ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాకర్లకు చిక్కదు.
స్కామర్లు కొన్ని మెసేజ్ ల ద్వారా కూడా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తారు. ఇవి చూడటానికి అచ్చం మీ బ్యాంక్ నుండి వచ్చిన మెసేజ్ లు లాగా ఉంటాయి. ఇలాంటి మెసేజ్ లలో లింక్స్ ఉంటాయి. ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే మీ మొత్తం సమాచారాన్ని హ్యాకర్లు యాక్సెస్ చేస్తారు. అలాంటి మెసేజ్ లు వస్తే వాటిని జాగ్రత్తగా చదవండి. వాటికి రియాక్ట్ అవ్వకుండా నేరుగా బ్యాంకుకు వెళ్ళి అడగండి. లేదా బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఎంక్వైరీ చెయ్యండి. బ్యాంక్ బ్యాలెన్స్‌లు, టెక్నికల్ మెయింటెనెన్స్, పాస్‌వర్డ్ లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. కచ్చితంగా మీరు బ్యాంక్ వార్నింగ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేస్తే ఎలాంటి తప్పు జరిగినా కూడా బ్యాంకు దృష్టికి వెళుతుంది. కాబట్టి కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ జాగ్రత్తల గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.