మోటో కొత్త కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్.. చేతికి బ్రేస్‌లెట్ గా పెట్టుకోవచ్చు!

కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. దీనిలో భాగంగానే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల తయారీ పట్ల ఫోకస్ చేస్తున్నాయి కంపెనీలు.

కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. దీనిలో భాగంగానే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల తయారీ పట్ల ఫోకస్ చేస్తున్నాయి కంపెనీలు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా కొత్త రకం మోడళ్లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లపై యువతలో ఎంతటి క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. కొత్త రకం స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలు ఖర్చుకు వెనకాడకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటి వరకు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లు అని కొత్త రకం మొబైల్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త రకం స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది.ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలా కొత్త రకం మొబైల్‌ని ఆవిష్కరించింది. ఈ ఫోన్ ను మడత పెట్టడంతో పాటు చేతికి బ్రేస్ లెట్ గా కూడా పెట్టుకోవచ్చు.

కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. దీనిలో భాగంగానే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల తయారీ పట్ల ఫోకస్ చేస్తున్నాయి కంపెనీలు. అయితే ఇంకాస్త కొత్త రకంగా ఉండేందుకు మోటోరోలా మరో కొత్త కాన్సెప్ట్‌ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. తన మాతృ సంస్థ లెనోవా టెక్‌ వరల్డ్‌ 2023 ఈవెంట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించింది. కాగా మోటోరోలా కాన్సెప్ట్‌ స్మార్ట్ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నం. ఫోల్డబుల్‌ ఫోన్లలా మడతపెట్టడంతో పాటు సులువుగా రోల్ చేసేయొచ్చు. ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే ఉండడంతో చేతికి బ్రేస్‌లెట్‌ వేసుకున్నట్లుగా మణికట్టుకు చుట్టుకోవచ్చు. యూజర్ల అవసరానికి తగినట్లుగా వివిధ రూపాల్లోకి మార్చుకోవచ్చు.

వీడియో కాల్‌ మాట్లాడటానికి, సోషల్‌ మీడియా స్క్రోలింగ్‌ వంటి వాటికి ఈ ఫోన్‌ ఉపయోగకరంగా ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఇది 6.9-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానుందని వెల్లడించింది. అంతే కాదు ఇందులో వినియోగించిన ఏఐ టెక్నాలజీ సాయంతో ఫొటోలు తీయటం సులువు. అలాగే మొబైల్‌ ఫోన్‌లో స్క్రీన్ షాట్‌ తీసి అందులోని సున్నితమైన కంటెంట్‌ని బ్లర్‌ చేయొచ్చు. కాగా ఈ ఫోన్ యొక్క ధర, ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాలు ఇంకా వెల్లడికాలేదు.

Show comments