Lava Blaze 3: తక్కువ ధరలో లావా నుంచి అదిరిపోయే 5జి ఫోన్!

Lava Blaze 3: లావా Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీరు తక్కువ ధరలో చాలా మంచి ఫీచర్లను పొందవచ్చు.

Lava Blaze 3: లావా Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీరు తక్కువ ధరలో చాలా మంచి ఫీచర్లను పొందవచ్చు.

తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా  బడ్జెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. లావా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ని Lava Blaze 3 5G పేరుతో లాంచ్ చేసింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్‌లో మీరు తక్కువ ధరలో చాలా మంచి ఫీచర్లను పొందవచ్చు. పైగా ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన లుక్‌తో మార్కెట్లోకి విడుదల అయ్యింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో 5జి స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ లో ఆకట్టుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే దీని కెమెరా. లావా కంపెనీ ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది. దీనిలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ఇంకా అదే సమయంలో సెల్ఫీ, వీడియో చాట్ లు క్లారిటీగా ఉండేందుకు వీలుగా ఈ ఫోన్ లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే పవర్ కోసం కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా పవర్ ఫుల్ 5000mAh బ్యాటరీని ఫిక్స్ చేసింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో కూడిన 3.5mm ఆడియో జాక్ కూడా వస్తుంది.

ఇక ఈ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే.. ఇందులో 6 GB RAM ఉంటుంది. లావా కంపెనీ ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌లను ఫిక్స్ చేసింది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కంపెనీ ఈ సరికొత్త 3 5G స్మార్ట్‌ఫోన్‌ను గ్లాస్ గోల్డ్, గ్లాస్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసింది. ఇక ధర విషయానికి వస్తే.. కంపెనీ ఈ ఫోన్ ప్రారంభ ధరను కేవలం రూ.9999 లో మాత్రమే తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్‌ సెప్టెంబర్ 18 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments